ఎమ్మార్పీఎస్ (టి.ఎస్) ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి, ఆర్మూర్, నందిపేట్ మండలాల నూతన కమిటీల నియామకం.
జాతి హక్కుల పోరాటంలో వెనకడుగేసేది లేదని రాష్ట్ర నాయకులు సల్లూరి శ్రీనివాస్, బచ్చపల్లి దేవయ్య స్పష్టం చేశారు.
ఎమ్మార్పీఎస్ (టి.ఎస్) నూతన కమిటీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి, ఆర్మూర్, నందిపేట్ మండలాల నూతన కమిటీల నియామకం.
జాతి హక్కుల పోరాటంలో వెనకడుగేసేది లేదని రాష్ట్ర నాయకులు సల్లూరి శ్రీనివాస్, బచ్చపల్లి దేవయ్య స్పష్టం చేశారు.
తెలంగాణ ఫోకస్ టీవీ(ఆర్మూర్ న్యూస్ -పొన్నాల) సెప్టెంబర్ 19:
తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ MRPS(TS) రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు మండలాలకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా పూర్వ అధ్యక్షుడు సల్లూరి శ్రీనివాస్, పూర్వ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చపల్లి దేవయ్యల అధ్యక్షతన ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు.
నూతన బాధ్యులు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి చిర్ర నాగరాజు, ఆర్మూర్ మండల అధ్యక్షుడు పొన్నాల రాజేశ్వర్, నందిపేట్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు లను నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకులు సల్లూరి శ్రీనివాస్, బచ్చపల్లి దేవయ్యలు మాట్లాడుతూ… అధిష్టానం పిలుపు మేరకు మాదిగ మరియు మాదిగ ఉప కులాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి హక్కుల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు.
నాయకుల ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు:
వివక్షపై రాజీలేని పోరాటం: సమాజంలో మాదిగ, మాదిగ ఉప కులాలపై జరుగుతున్న అనిచివేతను, వివక్షను ఎండగడుతూ ఎప్పటికప్పుడు అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
కఠిన చర్యలకు డిమాండ్: జాతి ప్రయోజనాల కోసం, ఆత్మగౌరవం కోసం ముందుండి పోరాడతామని, సమాజంలో తమ జాతికి ఉన్న ప్రత్యేకతను కాపాడుకుంటామని తెలిపారు. దళితులపై దాడులకు పాల్పడే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అట్రాసిటీ కేసుల నమోదు: వివక్ష, అణచివేతకు పాల్పడే శక్తులపై బాధితులకు అండగా నిలుస్తూ అట్రాసిటీ కేసుల నమోదు ద్వారా వారికి న్యాయం జరిగేలా చూస్తామని హెచ్చరించారు.
సమాజ శ్రేయస్సుకు, మాదిగ జాతి సమగ్ర వికాసానికి కొత్తగా నియమితులైన కార్యవర్గం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోరాటాలు కొనసాగించాలని నాయకులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకులు మాదిగ మాదిగ ఉప కులాల సంఘ సభ్యులు ఆర్మూర్ 29వ వార్డు ఎస్సీ మాదిగ సంఘం కుల పెద్దమనుషులు తదితర మాదిగ సోదరులు పాల్గొన్నారు