33వ వార్డు బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మున్నూరు కాపు ముద్దుబిడ్డ బోగడమీది రాణి- సుమన్..
–33వ వార్డు అభ్యర్థిగా ఆశీర్వదించండి. అవకాశం కల్పించండి....అభివృద్ధి చేసి చూపిస్తా: బోగడమీది రాణి-సుమన్..
33వ వార్డు బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మున్నూరు కాపు ముద్దుబిడ్డ బోగడమీది రాణి- సుమన్
–33వ వార్డు అభ్యర్థిగా ఆశీర్వదించండి. అవకాశం కల్పించండి….అభివృద్ధి చేసి చూపిస్తా: బోగడమీది రాణి-సుమన్..
తెలంగాణ ఫోకస్ ఆర్మూర్ జనవరి 30:
ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీలు రసవత్తంగా మారాయి. తమ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రధాన పార్టీ ముఖ్య నాయకులు ఎక్కడికక్కడ మంతనాలు కొనసాగిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో విజయం సాధించాలంటే పార్టీకి బలమైన వ్యక్తి సమర్థవంతమైన నాయకులు ఆ వార్డును అభివృద్ధి పథంలో తీసుకవెళ్లే వారినే గెలిపించుకునే దిశలో ముందుకు వెళ్తూ.. 33 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బోగడమిది రాణి-సుమన్ శుక్రవారం రోజున ఆర్మూర్ ప్రభుత్వ (బాలికల) జూనియర్ కళాశాలలో నామినేషన్ దాఖలు చేశారు. వార్డు ప్రజలు, స్థానికులు వీరితోనే వార్డు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికలో ముఖ్యంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన 33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మున్నూరు కాపు ముద్దుబిడ్డ బోగడమీది రాణి-సుమన్ తాను వార్డు అభివృద్ధి కొరకు ముందుకు రావడం అభినందనీయమని, స్థానికులు వార్డు ప్రజలు వారిని ఆశీర్వదించాలని కోరారు. 33వ వార్డు పెద్దల సహాయ సహకారంతో వార్డును ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీతోనే వార్డు అభివృద్ధి, పట్టణ అభివృద్ధి పథంలో కొన్నసాగుతుందని అన్నారు,
ఈ సందర్భంగా బోగడమీది రాణి- సుమన్ మాట్లాడుతూ.. మేరకు ఆయన సూచనలకు అనుగుణంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వార్డు ప్రజలు సహకరించాలని కోరారు.
వార్డును అభివృద్ధి పథంలో తీసుక వెళ్లడానికి పార్టీ అండదండలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. అవకాశం కల్పించండి ఆశీర్వదించండి గెలిపించుకొని పనులు సమగ్ర సమానత్వతో పనులు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ 33వ వార్డులో ఉన్న సమస్యలను స్థానిక పెద్దల సహకారంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 33 వార్డు సీనియర్ నాయకులు జెట్టి రాజేందర్, జాహెద్, దొడ్ల శ్రీనివాస్, సిద్దాపురం చిన్నయ్య సిద్దాపురం లింగన్న, సిద్దాపురం రాజేశ్వర్, షబ్బీర్, నారాయణపేట రాజకుమార్, రంజిత్, బిట్టు బోగడమీది భోజన్న, లక్కకుల రంజిత్, నక్షత్ర యూత్ క్లబ్ సభ్యులు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు