A place where you need to follow for what happening in world cup

సాదాబైనామా పెండింగ్ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.

0 38

సాదాబైనామా పెండింగ్ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.

తెలంగాణ ఫోకస్ మీ పొన్నాల:     నిజామాబాద్, నవంబర్ 28 : భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో ఆయా మండలాల వారీగా సాధించిన ప్రగతిని పరిశీలించారు. సాదాబైనామా పెండింగ్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలను తిరస్కరించినట్లైతే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్నచిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించకూడదని, అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పని చేయాలని హితవు పలికారు.
వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!