వెలగని వీధి దీపాలు, నిండిన డ్రైనేజీతో మురికి స్తూపంగా మారిన ఆర్మూర్ 33వ వార్డు.
-- మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం. --పాలకమండలి రద్దయిన తర్వాత కన్నెత్తి చూడని మున్సిపల్ సిబ్బంది
వెలగని వీధి దీపాలు, నిండిన డ్రైనేజీతో మురికి స్తూపంగా మారిన ఆర్మూర్ 33వ వార్డు.
–మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం.
–పాలకమండలి రద్దయిన తర్వాత కన్నెత్తి చూడని మున్సిపల్ సిబ్బంది
తెలంగాణ ఫోకస్ మీ పొన్నాల: ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డులో అనారోగ్యానికి గురి చేయడానికి మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తున్న ఘటన 33వ వార్డులో నెలకొంది.
ఇక చెప్పుకుంటూ పోతే స్థానిక వార్డు వాసులు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వార్డులోని కుప్పలు కుప్పలుగా పండిత్ వినీత పవన్ చైర్మన్ వార్డు వారి పదవీకాలం ముగిసిన తర్వాత మున్సిపల్ అధికారులు 33 వ వార్డు వైపు కన్నెత్తి చూసిన దాఖలు లేవు మరి ముఖ్యంగా ఈ వార్డు మల్లారెడ్డి చెరువుకు అనుకొని ఉండటం వల్ల చెరువు నుండి వచ్చే దుర్వాసన దోమలు పందులు వలన సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు కాలనీవాసులు గత మున్సిపల్ కమిషనర్ రాజుకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వార్డ్ వైపు కన్నెత్తి చూసిన దాఖలు లేవు.మరి ముఖ్యంగా గోల్డ్ బంగ్లా( శివాజీ చౌక్) పక్కనే ఉండడం వల్ల పండగ సమయంలో, ర్యాలీల సమయంలో, పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు డైవర్షన్ గా 33 వ వార్డును వాడుతారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఏర్పాటుచేసిన ఐ మాస్ బల్బులు గత సంవత్సరముగా వెలగక కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో దొంగలు కాలనీవాసుల యొక్క ద్విచక్ర వాహనాలు నుండి పెట్రోల్ ను, కారుల యొక్క చక్రాలను విప్పుకుపోతున్నారు. నెల రోజుల క్రితం కొండచిలువ చెరువులో నుండి రాత్రి సమయంలో రోడ్డు పైకి రాగా కాలనీవాసులు దానిని చంపి వేశారూ. ఈ వార్డు మల్లారెడ్డి చెరువుకు ఆనుకుని ఉండడం వల్ల చెరువు పక్కన ఏర్పాటు చేసిన డ్రైనేజీ పూర్తిగా నిండిపోయింది మున్సిపల్ జవాన్ భాజన్నను ఈ విషయమై అడగగా తనకు వార్డుతో ఎలాంటి మీకు దమ్ముంటే మున్సిపల్ కమిషనర్ తో వాదనకు దిగకండి అంటున్నాడు కానీ నాతో కాదని ఖరాఖండిగా చెబుతున్నాడు.కాలనీలో ఏ ఫంక్షన్ లో అయినా, ఇండల్లో ఉండే చెత్తను కూడా సరైన సమయంలో చెత్త బండి రాక చెరువుకు అనుకొని ఉన్న డ్రైనేజీలో చెత్తను వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గత పాలకవర్గం ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లు వెలగాక పోవడంతో మూడు రోడ్ల పైన ఉన్న అంధకారంతో ద్విచక్ర వాహనదారులు పాదచారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్షణమే నూతనంగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ రవిబాబు స్పందించి 33 వ వార్డు యొక్క సమస్యలను తీర్చాలని స్థానికులు నరేష్, నవీన్, రాజారెడ్డి, గంగాధర్, సుమన్, రాజ్ కుమార్,ఒడ్డెన్న, చిన్న గంగారం తదితరులు మున్సిపల్ అధికారులను తక్షణమే కాలనీవాసుల సమస్యలను తీర్చాలని మున్సిపల్ కమిషనర్ ను, సానిటరీ ఇన్స్పెక్టర్ ను కోరుతున్నారు.