A place where you need to follow for what happening in world cup

నూతన టెక్నాలజీని ప్రారంభించిన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్.

0 58

నూతన టెక్నాలజీని ప్రారంభించిన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్.                                    తెలంగాణ ఫోకస్ న్యూస్:                   ఏఐ సహాయంతో పలు రకాల రాజకీయ, వ్యాపార, వాణిజ్య, ప్రకటనల కోసం రూపొందించిన నూతన టెక్నాలజీ ని బుధవారం శ్రీరామ కాలనీ గల ఈ ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ప్రారంభించారు. ఆర్మూర్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో గల బంజారా ఎలక్ట్రానిక్స్ యజమాని రాజశేఖర్ బాల్య మిత్రుడు అయినటువంటి రజనీష్ కిరాడ్ ఏఐ టెక్నాలజీతో బంజారా ఎలక్ట్రానిక్స్లో నూతనంగా స్టూడియోను ఏర్పాటు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన నేతల సంబరాల చేసుకునే విధంగా ప్రకటనను రూపొందించి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఏఐ సహాయంతో రూపొందించిన ఆయనను ఈరవత్రి రాజశేఖర్ శాలువాతో సన్మానించి, అభినందించారు. అతి తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో రాజకీయ ప్రకటనలు మరియు పలు రకాల వ్యాపార ప్రకటనలు అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయం అన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ నూతన టెక్నాలజీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు డిష్ రాంప్రసాద్, కొండి రామచందర్, సడక్ ప్రమోద్, టైలర్ వినోద్, రాస ఆనంద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!