A place where you need to follow for what happening in world cup

ఆర్మూర్ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన అరుంధతి నగర్ ఎస్పీ కాలనీవాసులు..

0 42

ఆర్మూర్ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన అరుంధతి నగర్ ఎస్పీ కాలనీవాసులు..

తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్)

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి  చొరవతో టియుఎఫ్ఐ డిసి నిధులు తో మల్ల రెడ్డి చెరువు (మల్లెడి చెరువు)నుండి అరుంధతి నగర్ స్మశాన వాటిక పిప్రి రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఆర్మూర్ పట్టణ బిజెపి నాయకులు రోడ్డు విస్తరణ పనులు పరిశీలించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కి అట్టి కాలనీవాసులు ఆర్మూర్ పట్టణ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు పనుల కోసం ఎదురుచూసిన పట్టణవాసులు కల సహకారం అవుతున్న వేళ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మందుల బాలు సీనియర్ నాయకులు జెస్సు అనిల్, సుంకరి రంగన్న, ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్ ఉపాధ్యక్షులు బాండ్లపల్లి నర్సిరెడ్డి, కార్యదర్శి కుమార్, బాసెట్టి రాజ్ కుమార్, బీజేవైఎం అధ్యక్షులు ఉదయ్ గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జ్ జగన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!