A place where you need to follow for what happening in world cup

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల నిబంధనల ప్రకారంగా ఫ్లైయిగ్స్ కార్డ్ అధికారులు తనిఖీలు..

0 55

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల నిబంధనల ప్రకారంగా ఫ్లైయిగ్స్ కార్డ్ అధికారులు తనిఖీలు..      తెలంగాణ ఫోకస్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నేటికీ నామినేషన్ ప్రక్రియ రెండో రోజు ముగిసింది రేపు నామినేషన్ దాఖల ప్రక్రియ చివరి రోజుగా కొనసాగనున్నది

ఈ తరుణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ప్రధాన కూడికల ప్రాంతాలలో వాహనాల తనిఖీలను సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్నారు.. ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ గౌడ్ సూచనల మేరకు పట్టణంలోని మామిడి పల్లి చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించారు ఇందులో వాహనదారులు, ప్రజలు పోలీస్ అధికారులకు మరియు సంబంధిత శాఖల అధికారులకు సహకరించాలని అధికారులు కోరారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఎలక్షన్ కోడ్ అమలులో ఉందని మరోసారి గుర్తు చేశారు. ఫ్లైయిగ్స్ కార్డ్ అధికారులు ఏఈ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ వినీత్ రావు వారి సిబ్బంది సంబంధిత అధికారుల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేసే క్రమంలో ₹50,000/- మించి ఉండకూడదని, ఒకవేళ అంతకుమించి డబ్బులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పత్రాలు చూపించి సమాధానాలు సానుకూలంగా సమాధానాలు చెప్పాలని, లేనియెడల ఎన్నికల నిబంధనల ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
ఒకవేళ 50,000 మించి డబ్బులు తీసుకువెళ్తే వాటికి సంబంధించిన పత్రాలను అడిగిన వెంటనే అధికారులకు చూపించాలని అట్టి డబ్బులు సరిగా ఉండి వాటికి సంబంధించిన పత్రాలు చూపించాలని, లేనియెడల ఎన్నికల నిబంధనల ఉల్లంఘించినట్లు అవుతారని ఏ.ఈ నాగరాజు,ఆర్మూర్ హెడ్ కానిస్టేబుల్ వినీత్ రావు సంబంధిత అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!