ఆర్మూర్ లో తుంగపూతతో ప్రాణహాని.. వైద్యులు వెల్లడి.
-మున్నూరు కాపు మూడు పంథాల ఆధ్వర్యంలో తుంగపూతకు డ్రోన్ తో పిచికారి.
ఆర్మూర్ లో తుంగపూతతో ప్రాణహాని.. వైద్యులు వెల్లడి.
– మున్నూరు కాపు మూడు పంథాల ఆధ్వర్యంలో తుంగపూతకు డ్రోన్ తో పిచికారి. – ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేయాలి.. స్థానికుల ప్రాణాలు కాపాడాలి. తెలంగాణ ఫోకస్ న్యూస్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మున్నూరు కాపు మూడు పంథాల ఆధ్వర్యంలో శనివారం రోజున నల్ల పోచమ్మ గుడి వద్ద,గుడికి ఆనుకొని ఉన్న మల్లారెడ్డి చెరువు కింద మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న తుంగపూతతో ఎంతో ప్రాణహాని ఉందని, ఆ తుంగపూతతో వచ్చే గాలి వలన కండ్లు పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు స్థానికులకు చెప్పడంతో మున్నూరు కాపు మూడు పంథాల పెద్దమనుషులకు పెద్ద కాపులకు చెప్పడంతో వెంటనే స్పందించి శనివారం రోజున ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు తుంగపూత పైన డ్రోన్ తో పిచికారి చేయించడం జరిగింది. స్థానికులు చెప్పగానే వెంటనే స్పందించిన మున్నూరు కాపు మూడు పంథాల సదరులు, పెద్దమనుషులకు ప్రజల ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మూడు పంథాల సదరులు తెడ్డు బాల్ రెడ్డి, గోర్త దేవేందర్, బండి పోశెట్టి తో పాటు పెద్దకాపులు సంఘ సభ్యులు పాల భాస్కర్ తదితర సంఘ పెద్దలు పాల్గొన్నారు