A place where you need to follow for what happening in world cup

దొంగతనం కేసు ను చేధించిన ఆర్మూర్ పోలీస్ బృందం.

-ఐడి పార్టీ పోలీసులను అభినందించి, నగదు రివార్డు అందజేసిన ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ

0 65

దొంగతనం కేసు ను చేధించిన ఆర్మూర్ పోలీస్ బృందం.          –ఐడి పార్టీ పోలీసులను అభినందించి, నగదు రివార్డు అందజేసిన ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ గౌడ్ వెల్లడి.

తెలంగాణ ఫోకస్ న్యూస్ (ఆర్మూర్ క్రైమ్)జనవరి 31: ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్, అవుట్ గల్లి దయానంద్ నగర్ తదితర ప్రాంతాల్లో ఈనెల 11న రాత్రి సమయంలో ఐదు ఇళ్లలో దొంగతనం చేసిన వ్యక్తి అల్లకుంట శ్రీనివాస్ ను పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తి నివాసం పిప్రి గ్రామంగా ఐడి పార్టీ పోలీస్ అధికారులు గుర్తించి అతనిని ఇంటి నుండి అరెస్టు చేసినట్లు పట్టణ టౌన్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ ప్రకటనలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. దొంగతనం చేసిన వ్యక్తి వద్దనుండి పూర్తి సమాచారాన్ని సేకరించి అతను దొంగలించిన బంగార ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు  ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ గౌడ్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఆరోజు అనగా ఈనెల 11న దొంగిలించిన 6.9 తులాల వివిధ రకాల బంగార ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.          అట్టి వ్యక్తి పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచలనట్లు తెలియజేశారు.
ఈ దొంగతన కేసును చాకచక్యంగా 15 రోజుల కాలవ్యవధిలో చేదించిన ఐడి పార్టీ పోలీస్ అధికారులను ప్రశంసించి, తగు రివార్డులను ఐడి పార్టీ కిరణ్ కుమార్, హరీష్,లక్ష్మీనారాయణ కానిస్టేబుల్ లకు నగదు రివార్డు అందజేసి అభినందించారు

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!