అధిష్టానం ఆదేశాల మేరకు చైర్పర్సన్ & వైస్ చైర్మన్ లను ప్రకటించడానికి అభ్యర్థులు సహకరించాలి: పొద్దుటూరి వినయ్ రెడ్డి
పొద్దుటూరి వినయ్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ అభ్యర్థులందరికీ సముచిత స్థానం:
కాంగ్రెస్ ఇంఛార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులందరికీ సముచిత స్థానం: –అధిష్టానం ఆదేశాల మేరకు చైర్పర్సన్ & వైస్ చైర్మన్ లను ప్రకటించడానికి అభ్యర్థులు సహకరించాలి:వినయ్ రెడ్డి ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ టీవీ)ఫిబ్రవరి15 మున్సిపల్ కార్పొరేషన్ రెండవ సాధారణ ఎన్నికల్లో ఆర్మూర్ పట్టణ మున్సిపల్ ఎన్నికలు పట్టణ ప్రజల సహకారంతో పోలీసు యంత్రాంగంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి గందరగోళాలు జరగకుండా విధులు నిర్వహించిన ఏసిపి, ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ గౌడ్ లతో పాటు పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకలను పాటించి తమ అమూల్యమైన ఓటు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో ఆర్మూర్ పోల్ శాఖ వారు తమ విధుల్లో సహకరించడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.అనంతరం కౌంటింగ్ ప్రక్రియలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాఫీగా కొనసాగాయి.. రేపు అనగా16.02.2026న జరగబోయే ప్రమాణస్వీకారం రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఆర్మూర్ గౌరవ శ్రీ ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గారిని, వైస్ చైర్మన్ లను రేపు సోమవారం ప్రకటించనున్నారు. వివిధ వార్డు అభ్యర్థులు తమకు చైర్పర్సన్ & వైస్ చైర్మన్ రాలేదని చింతించకుండా వినయ్ రెడ్డి నేతృత్వంలో పనిచేయండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో వారికి సముచిత స్థానాన్ని కల్పించే వ్యక్తి పొద్దుటూరు వినయ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్మూర్ పట్టణ ప్రజలు 36 వార్డు ఓటరు మహాశయులు విజ్ఞప్తి: శ్రీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తాను చెప్పింది చెప్పినట్టుగా సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా విజయాన్ని సాధించడం జరిగిందో అదే దిశలో ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని “తెలంగాణ ఫోకస్ టీవీ తో”‘ చెప్పిన మాట నిలబెట్టుకున్నందుకు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ.. వినయ్ రెడ్డి నేతృత్వంలో పట్టణాన్ని సుందరమయంగా మార్చాలని ప్రతి వార్డును అభివృద్ధి చేసి ఇతర మున్సిపాలిటీల కన్నా ఆర్మూర్ మున్సిపాలిటీ ఆదర్శంగా తిర్చిదిద్దేందుకు ఆయన ఎల్లప్పుడూ ముందుంటానని “తెలంగాణ ఫోకస్ టీవీ”తో చెప్పడంజరిగింది. ఇందుకుగాను మనం చేయాల్సిన పని రూలింగ్ గవర్నమెంట్ ఉన్నందున వారి వద్ద నుండి వార్డుకు సరిపడే నిధులను తెచ్చుకొని ఆయా ఆ వార్డులో గెలిచిన అభ్యర్థులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని వార్డు ను అభివృద్ధి చేసుకునే దిశలో ముందుకు వెళ్లి గౌరవ వినయ్ కుమార్ కుమార్ రెడ్డి గారి మాటను నిలబెట్టి ముందుకు కొనసాగాలని వారి నేతృత్వంతోనే పట్టణం అభివృద్ధి జరుగుతుందని పట్టణ ప్రజలు గమనించాలని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి అభిమానులు కోరుతున్నారు. అభ్యర్థులు తమ వార్డును అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం పై ఆయన అభినందనలు తెలుపుతూ.. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు పనిచేసి ఉత్తములుగా నిలవాలని ఆ వార్డు ప్రజల మన్నులు పొందాలని కోరుకునే వ్యక్తి పొద్దుటూరి వినయ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు
