ఆర్మూర్ ఎమ్మెల్యే అరెస్టు ను ఖండిస్తూ నిజాంసాగర్ కెనాల్ బ్రిడ్జిపై ఆందోళన. – ఖబర్దార్ సీ.ఎం రేవంత్ రెడ్డి.. నీ అక్రమ అరెస్టులకు భయపడే వారిమి కాదని హెచ్చరించిన: ఆర్మూర్ బిజెపి నాయకులు..
ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్ టీవీ -పొన్నాల)ఫిబ్రవరి 21: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అరెస్టును ఆర్మూర్ పట్టణ బిజెపి నాయకులు కార్యకర్తలు శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులు కిషన్ మోర్చా నాయకులు ముఖ్యంగా కార్యకర్తలు ఆర్మూరు పట్టణ బిజెపి అధ్యక్షులు మందుల బాలు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సాయంత్రం ధర్నా నిర్వహించి అక్కడి నుండి క్లాక్ టవర్ దగ్గర గల నిజాంసాగర్ కెనాల్ బ్రిడ్జిపై బైఠాయించి నిరసన తెలుపుతూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన బిజెపి కాంగ్రెస్ మధ్య ఘర్షణ ను ఖండిస్తూ.. మేడ్చల్ వద్ద ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి నిరసనగా బైఠాయించడంతో పోలీసులు అక్రమ అరెస్టు చేశారని పోలీసుల వైఖరి మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తే రానున్న రోజుల్లో బిజెపి పార్టీ తమ అధికారం వచ్చాక ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పోల్కం వేణు, రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు, బిజెపి నాయకులు జెస్సు అనిల్ కుమార్, కలిగోట గంగాధర్, యామాద్రి భాస్కర్, పులి యుగేందర్,కలిగోట ప్రశాంత్,బొట్టు నాగరాజు, దొండి ఈశ్వర్, మిర్యాల్ కార్ కిరణ్, ఉదయ్ గౌడ్, గోవింద్ పెట్ రాజు,వేణు, పుట్టి మురళి, గటడి అనిల్ తదితర బిజెపి పార్టీ బూత్ స్థాయి నాయకుల నుండి కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలిపారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని పట్టణ బిజెపి నాయకులు ముక్తకంఠంతో హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్ నీ అక్రమ అరెస్టులకు భయపడే వారిమి కాదని నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.