A place where you need to follow for what happening in world cup

కప్పం కట్టడం వల్లే సీఎం పోస్టింగ్, లేకుంటే ఎప్పుడో ఊస్టింగ్.. -తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎం గా మార్చిన రేవంత్

0 47

కప్పం కట్టడం వల్లే సీఎం పోస్టింగ్, లేకుంటే ఎప్పుడో ఊస్టింగ్..

తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎం గా మార్చిన రేవంత్

– తాజాగా గాంధీ ఫ్యామిలీకి వెయ్యి కోట్లు ఇచ్చేలా ఎంవోయూ

– డబ్బు సంచులు మోయడం కోసం మూసీ సుందరీకరణ పేరుతో దోపిడీ పర్వం

– తెలంగాణ జనాన్ని కొట్టి బతకడం, ఢిల్లీలో దొంగ దొరై తిరగడం

– గల్లీలో ప్రశ్నించే వారిపై పోలీసు కేసులు, ఢిల్లీకి సూట్ కేసులు

– మొత్తం కేబినెట్ నే డిల్లీకి పిలిచి డబ్బు లు ఇవ్వాలని టార్గెట్లు

– హస్తినలో ఖద్దరు పెద్దలకు తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

తెలంగాణ ఫోకస్ టీవీ -మీ పొన్నాల ఫిబ్రవరి 23:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొట్టి క్రమం తప్పకుండా డిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టడం వల్లే ఆయన సీఎం పోస్టింగ్ ఉందని, లేకుంటే ఎప్పుడో ఊస్టింగ్ అయి ఉండేదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఏఐసీసీకి ఏటీఎం గా మార్చారని ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు.
తాజాగా గాంధీ ఫ్యామిలీకి వెయ్యి కోట్లు ఇచ్చేలా ఎంవోయూ కుదుర్చు కున్నారని ఆయన ఆరోపించారు. తన అవినీతి పాలనకు డిల్లీలో కొమ్ముగాస్తు న్న కేసీ వేణుగోపాల్ కోసం కేరళఎన్నికల్లో ఖర్చుచేయడం కోసం రేవంత్ రెడ్డి ఈ వెయ్యి కోట్ల రూపాయలను ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు ఏమిటి పదివేల కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమని స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పిన విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐసీసీ పెద్దలకు, ముఖ్యంగా గాంధీ కుటుంబా నికి నిధులు సమకూరుస్తోందనే ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చాయన్నారు. తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని ఢిల్లీకి ‘కప్పం’గా కడుతు న్నారని, ఇది రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఢిల్లీకి పిలిపించుకుని తరచూ సమీక్షలు నిర్వహించడం, రాష్ట్ర నేతలను నిధుల సేకరణకు ఆదేశించడంపై రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికు తోందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు మళ్లీ అవమానమే ఎదురవు తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిల్లీకి డబ్బు సంచులు మోయడం కోసం మూసీ సుందరీకరణ పేరుతో దోపిడీ పర్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీసిందని ఆయన ధ్వజమెత్తారు. ప్యూచరు సిటీ, మూసీ నది సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి కుటుంబం రియల్ ఎస్టేట్ దందా చేస్తోందన్నారు. తెలంగాణ జనాన్ని కొట్టి బతకడం, ఢిల్లీలో దొంగ దొరై తిరగడం మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేవారిపై పోలీసు కేసులు,ఢిల్లీకి సూట్ కేసులు అన్న విధంగా ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. మొత్తం కేబినెట్ నే డిల్లీకి పిలిచి డబ్బులు ఇవ్వాలని టార్గెట్లు పెట్టడం ఏఐసీసీ అహంకారానికి నిదర్శనమని
ఆయన అభివర్ణించారు. హస్తినలో ఖద్దరు పెద్దలకు తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!