“రోడ్డు ప్రమాదాలు-నివారణ-జాగ్రత్తల”పై విద్యార్థులకు అవగాహన:
ముఖ్యఅతిథిగా మెండోర ఎస్సై సుహాసిని.
తెలంగాణ ఫోకస్ టీవీ న్యూస్: ఫిబ్రవరి 24: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ మెండోర మండలంలోని పోచంపాడ్ ఉన్నత పాఠశాలలో “రోడ్డు ప్రమాదాలు-నివారణ” పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రొద్దుటూరు మమత అధ్యక్షతన వహించగా మెండోర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సుహాసిని ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు-నివారణ- జాగ్రత్తలపై అవగాహన కలిగించి చైతన్య పరిచారు. మెండోరా ఎస్సై సుహాసిని మాట్లాడుతూ.. టూ వీలర్స్ నడిపించే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలన్నారు.వెహికల్స్ నడిపేవారు మారకద్రవ్యాలకు దూరంగా ఉండాలని,మత్తు పదార్థాలు తీసుకొని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మైనారిటీ తీరని వాళ్లు అసలే వెహికల్స్ నడపవద్దని,మైనార్టీ తీరని విద్యార్థిని విద్యార్థులు వాహనాల జోలికి వెళ్ళవద్దని, యువత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని హితవు పలికారు.యువత గంజాయి సేవించి, మద్యం మత్తులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, తల్లిదండ్రులు,గురువులు పిల్లలను గంజాయి సేవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.చివరగా విద్యార్థినీ విద్యార్థులచే మత్తు పదార్థాలు సేవించమని, మైనార్టీ తీరని పిల్లలమైన మేము వెహికల్స్ నడపమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నజీమొద్దీన్, కవిత,సురేంధర్,ధర్మపురి,చౌటి భూపతి,గోపి తదితరులు పాల్గొన్నారు.