A place where you need to follow for what happening in world cup

అనుమతి లేని కోకా నిర్మాణంపై అధికారుల ఉదాసీనత.. ఏడాదిగా కలెక్టరేట్ చుట్టూ బాధితుడి ప్రదక్షిణలు!

0 52

అనుమతి లేని కోకా నిర్మాణంపై అధికారుల ఉదాసీనత.. ఏడాదిగా కలెక్టరేట్ చుట్టూ బాధితుడి ప్రదక్షిణలు!

~ మున్సిపల్ అధికారుల నోటీసులు బేఖాతర్.. తెరవెనుక బలమైన శక్తుల హస్తంపై అనుమానాలు!

~ ఆర్మూర్ పంత్ రోడ్డులో అడ్డగోలుగా అక్రమ నిర్మాణం.. స్పందించని యంత్రాంగం.

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ టీవీ):

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ఎలాంటి అనుమతులు లేకుండా అర్మూర్ పట్టణంలోని పంత్ రోడ్డులో చేపట్టిన అక్రమ కోకా (షెడ్యూల్డ్ నిర్మాణం) బాధితుడి వ్యాపారానికి శాపంగా మారింది. దీనిని తొలగించాలని కోరుతూ బాధితుడు సోమవారం జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు మరోసారి ఫిర్యాదు చేశాడు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

అసలేం జరిగింది?

పట్టణంలోని మగ్దుం నగర్ కాలనీకి చెందిన షేక్ శబ్బీర్ అనే వ్యాపారి పంత్ రోడ్డులో షెటర్ రూమ్ కొనుగోలు చేసి వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే, తాఫిక్ అనే వ్యక్తి మున్సిపల్ నుండి గానీ, వ్యాపారి నుండి గానీ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా అక్రమంగా కోకాను నిర్మించాడు. ఈ అక్రమ నిర్మాణం వల్ల షేక్ శబ్బీర్ వ్యాపారానికి తీవ్ర ఆటంకం ఏర్పడుడమే కాకుండా, రాకపోకలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అధికారుల చుట్టూ ఏడాదిగా చక్కర్లు.. ఫలితం శూన్యం!

ఈ అక్రమ నిర్మాణంపై బాధితుడు మున్సిపల్ కమిషనర్ నుండి మొదలుకొని జిల్లా కలెక్టర్, సీడీఎంఏ (CDMA) అధికారుల వరకు అందరికీ ఫిర్యాదులు చేశాడు. అయినప్పటికీ, అధికారుల స్పందన నామమాత్రంగానే మిగిలిపోయింది. కోకాను తొలగించడంలో యంత్రాంగం విఫలమైంది. ఏడాది కాలంగా న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని బాధితుడు వాపోయాడు.

ఆర్టీఐ ద్వారా బయటపడిన నిజాలు..

ఈ వ్యవహారంపై బాధితుడు సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వివరాలు కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. 30 రోజుల అనంతరం అధికారులు ఇచ్చిన సమాచారంలో ఆ కోకాకు ఎలాంటి పర్మిషన్ లేదని స్పష్టమైంది. అంతేకాకుండా, ఆ అక్రమ కోకాను తొలగించాలని మున్సిపల్ అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేసినట్లు కూడా వెలుగులోకి వచ్చింది. అధికారులు స్వయంగా నోటీసులు ఇచ్చినా, వాటిని అమలు చేయడంలో ఎందుకు మీమాస ప్రదర్శిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తెరవెనుక బలమైన శక్తుల హస్తం ఉందా?

అధికారులు జారీ చేసిన నోటీసులను కూడా అమలు చేయలేకపోతుండటం వెనుక బలమైన రాజకీయ నాయకుల హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనం, నిబంధనలు గాలికొదిలేస్తుంటే ప్రభుత్వ శాఖలు చోద్యం చూడటం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు సంబందిత ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే స్పందించి అనుమతి లేని కోకాను తొలగించి బాధితుడికి న్యాయం చేయాలని ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!