A place where you need to follow for what happening in world cup

అయిలాపూర్ సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్‌పై ఆరోపణలు అవాస్తవం.

0 20

అయిలాపూర్ సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్‌పై ఆరోపణలు అవాస్తవం.

~ రెండోసారి చైర్మన్ కాకూడదనే ఉద్దేశంతో కొందరి కుట్ర

~ సొసైటీ కార్యాలయం ముందు విలేకరుల సమావేశం నిర్వహించిన రైతులు..

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ -పొన్నాల) నవంబర్ 11:   నందిపేట్ మండలం అయిలాపూర్ సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్‌పై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను రైతులు తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు సొసైటీ కార్యాలయం ముందు రైతులు విలేకరుల సమావేశం నిర్వహించి చైర్మన్‌కు మద్దతుగా మాట్లాడారు.  ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మీసాల సుదర్శన్ రెండోసారి సొసైటీ చైర్మన్ కాకూడదనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు కావాలనే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సుదర్శన్ గతంలో పలు పదవులు చేపట్టినప్పటికీ ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు సమయంలో రైస్ మిల్లర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు కలగకుండా చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు.

రూ.1.26 కోట్లతో 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నూతన గోదాం నిర్మాణం…

మీసాల సుదర్శన్ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే సొసైటీ అభివృద్ధిలో భాగంగా రూ.1 కోటి 26 లక్షల వ్యయంతో 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన నూతన గోదాం నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయించారని రైతులు తెలిపారు. మీసాల సుదర్శన్ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత నూతనంగా గోదాము ను నిర్మించడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ గోదాం ద్వారా సొసైటీకి నెలకు సుమారు రూ.లక్ష అద్దె ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నారని, తద్వారా సొసైటీకి శాశ్వత ఆదాయ వనరు ఏర్పడిందని రైతులు వివరించారు.

రైతుల కోసం ఐదు ఎకరాల స్థలం సిద్ధం.

గ్రామాల్లో వరి ధాన్యం ఆరబెట్టుకోవడానికి స్థలం లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులతో చర్చించి ఐదు ఎకరాల స్థలాన్ని చదును చేయించి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. సొసైటీ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిన మీసాల సుదర్శన్‌పై వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని రైతులు అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయవద్దని, సొసైటీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రైతులు ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాజు, వెంకటేష్, సంతోష్, బిక్షపతి, నగేష్, అనిల్, గంగాధర్, బోజన్న, సురేష్ రైతులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!