లబ్ధిదారుల నివాసానికి వెళ్లి 6వ వార్డు కౌన్సిలర్ షేర్ల మమత గంగాధర్ గౌడ్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత.
లబ్ధిదారుల నివాసానికి వెళ్లి 6వ వార్డు కౌన్సిలర్ షేర్ల మమత గంగాధర్ గౌడ్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత.
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ టీవీ -పొన్నాల) నవంబర్ 12: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ నిరంతరం అందుతున్నాయి. ఇందులో భాగంగానే ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారి ప్రత్యేక ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణం 6వ వార్డులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
6వ వార్డు కౌన్సిలర్ షేర్ల మమత గంగాధర్ గౌడ్ స్వయంగా లబ్ధిదారుల నివాసానికి వెళ్లి, 6వ వార్డుకు చెందిన కొండ ప్రవళిక తల్లి గారైన కొండ ఉమా నర్సా గౌడ్ గారికి కళ్యాణ లక్ష్మి చెక్కును అందజేశారు. ప్రభుత్వం పేద కుటుంబాలకు అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా కొనియాడారు.
ప్రభుత్వానికి, వినయ్ కుమార్ రెడ్డి గారికి లబ్ధిదారుల కృతజ్ఞతలు:
తమ కుటుంబానికి అందిన కళ్యాణ లక్ష్మి ఆర్థిక సహాయం వివాహ వేడుకలకు ఎంతో ఊరటనిచ్చిందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వానికి, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవనందిస్తున్న ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి గారికి చెక్కుదారులు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.