A place where you need to follow for what happening in world cup

బ్లూ కోల్ట్స్ పోలీసులు అశోక్, నాగరాజు లను నగదు రివార్డుతో అభినందించిన పోలీస్ కమిషనర్.

0 37

బ్యాంకులో చోరీకి యత్నించిన ముగ్గురు నిందితులను చాకచక్యంగా పట్టుకున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది…నగదు రివార్డుతో అభినందించిన పోలీస్ కమిషనర్.

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ -పొన్నాల) నవంబర్ 11:

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఇండియన్ బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌లో చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు నిందితులను విధి నిర్వహణలో ఉన్న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఎస్.నాగరాజు, పి.సి: 426, ఎన్.అశోక్, పి.సి 1937 లు అప్రమత్తతతో,చాకచక్యంగా పట్టుకోన్నారు.

బ్యాంకు వంటి కీలకమైన ఆర్థిక సంస్థలో చోరీకి యత్నిస్తున్న నిందితులను సకాలంలో గుర్తించి పట్టుకోవడం ద్వారా పెద్ద నేరం జరగకుండా సమర్థవంతంగా అడ్డుకున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది విధి నిర్వహణను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా బుధవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య, (ఐ.పి.ఎస్) సంబంధిత బ్లూ కోల్ట్స్ సిబ్బందికి నగదు రివార్డులు అందజేసి,వారి విధి నిర్వహణ పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని,    రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ అనుమానాస్పద వ్యక్తులు,కార్యకలాపాలను గుర్తించి తక్షణమే స్పందించాలని సూచించారు. పోలీసుల అప్రమత్తత, సమయస్ఫూర్తి, విధి పట్ల అంకితభావం ప్రజల ఆస్తులు, ప్రాణాల రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.          ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని , విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచే సిబ్బందిని పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు.  ఈ సందర్భంగా ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!