మానకొండూరు రవికుమార్ సిద్ధులగుట్ట ఛైర్మన్ గా నియామకం.
~ ప్రమాణస్వీకారం ఈ నెల 11న… పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ వెల్లడి.
ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్ -పొన్నాల) నవంబర్ 06:
ఆర్మూర్ ప్రాంతపు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం (సిద్ధులగుట్ట) నూతన పాలకమండలి నియామకం పూర్తయింది.
ఈ మేరకు శనివారం ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ అధికారికంగా వివరాలను వెల్లడించారు.
పాలకమండలి ప్రమాణస్వీకారం ఈ నెల 11వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ప్రమాణస్వీకార మహోత్సవానికి ఆర్మూర్ పట్టణ ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇదే ఆహ్వానంగా సాయిబాబా గౌడ్ కోరారు.
నూతన పాలకమండలి ఛైర్మన్ గా మానకొండూరు రవికుమార్ (జిమ్మీరవి), డైరెక్టర్లు చరణ్ రెడ్డి, హజారి సతీష్, చెందేశి శ్రీనివాస్, కొంతం మంజుల మురళి, ముఖ్య సలహాదారులుగా భారత్ గ్యాస్ సుమన్, కొడిగెల మల్లయ్య, బట్టు శంకర్, సలహాదారులుగా రామాగౌడ్, గంగారెడ్డి, చక్రవర్తి నియమితులయ్యారు.