ఈ నెల 11న “ఛలో హైదరాబాద్” ~రాష్ట్ర కార్మిక శాఖ మంత్రితో టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ భేటీ.
కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరిన ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మణికంఠ శేఖర్, సలహాదారులు వేణు పిలుపు..
ఈ నెల 11న “ఛలో హైదరాబాద్”
~ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రితో టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ భేటీ
~ మెకానిక్‌ల సంక్షేమం, వారు ఎదుర్కొంటున్న సుదీర్ఘ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 11న “ఛలో హైదరాబాద్”
~ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరిన ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మణికంఠ శేఖర్, సలహాదారులు వేణు పిలుపు..
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ -పొన్నాల) నవంబర్ 09
రాష్ట్రంలోని టూ వీలర్ మెకానిక్‌ల సంక్షేమం, వారు ఎదుర్కొంటున్న సుదీర్ఘ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 11న నిర్వహించనున్న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూర్ పట్టణ మరియు డివిజన్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మణికంఠ శేఖర్, సలహాదారులు వేణు పిలుపునిచ్చారు.
ఈ నెల 11న బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఆల్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రితో భేటీ కానున్నారు. మెకానిక్‌ల సమస్యలపై చర్చించేందుకు మంత్రివర్యులు ప్రత్యేకంగా సమయం కేటాయించారని సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు తోడేటి బాబు మీడియాకు వెల్లడించారు.
కార్మిక శాఖ మంత్రితో భేటీకి చొరవ చూపి అవకాశం కల్పించిన సొసైటీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు గజ్జెల స్వామికి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చే రాష్ట్ర, కార్యవర్గ సభ్యులు వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి బాబు ను సంప్రదించాలని కోరారు.
సొసైటీ అభివృద్ధికి, మెకానిక్‌ల సంక్షేమానికి కృషి చేస్తున్న ఆల్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులకు, రాష్ట్ర నాయకులకు, ముఖ్య సలహాదారులకు మరియు ఆర్మూర్ డివిజన్ సభ్యులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయా ప్రాంతాల్లోని మెకానిక్‌లందరూ సంఘటితమై ఈ ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని వారు కోరారు.