A place where you need to follow for what happening in world cup

ఇసుక తవ్వకాలు ఆపండి.. భూగర్భ జలాలను కాపాడండి!  ~ఆర్మూర్ సబ్ కలెక్టర్‌కు కలిగోట్ సర్పంచ్ నాయక రాజు, ఉప సర్పంచ్ సత్తెమ్మ గ్రామస్థులు వినతి.

సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సబ్ కలెక్టర్.

0 35

ఇసుక తవ్వకాలు ఆపండి.. భూగర్భ జలాలను కాపాడండి!   ~ ఆర్మూర్ సబ్ కలెక్టర్‌కు కలిగోట్ సర్పంచ్ నాయక రాజు, ఉప సర్పంచ్ సత్తెమ్మ గ్రామస్థుల వినతి.
~ సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సబ్ కలెక్టర్.

ఆర్మూర్/జక్రాన్‌పల్లి(తెలంగాణ ఫోకస్ టీవీ) నవంబర్ 16: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామ పరిధిలోని వాగు నుండి నిరంతరం సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాల వల్ల గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని, తక్షణమే ఇసుక తరలింపును నిలిపివేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ నాయక రాజు ఆధ్వర్యంలో గ్రామస్థులు ఆర్మూర్ సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నాయక రాజు మాట్లాడుతూ.. కలిగోట్ గ్రామ వాగు సమీపంలో బోర్లు వేసుకుని, సుమారు 3 నుండి 4 కిలోమీటర్ల దూరం పైపులైన్ల ద్వారా నీటిని తరలిస్తూ దాదాపు 2,000 ఎకరాల వరకు రైతులు పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. అలాగే గ్రామంలోని మూడు ప్రధాన వాటర్ ట్యాంకులకు కూడా ఇక్కడి నుండే తాగునీరు సరఫరా అవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్-నినో  ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొని, భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఇసుక తరలింపునకు సహకరించామని, కానీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇసుక తవ్వకాలను కొనసాగిస్తే పంటలు ఎండిపోవడమే కాకుండా గ్రామానికి తాగునీటి కష్టాలు తప్పవని అన్నారు. మళ్లీ వర్షాలు కురిసే వరకు ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేయాలని కోరారు. గ్రామస్థుల విజ్ఞప్తిని సావధానంగా విన్న ఆర్మూర్ సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి, సమస్య తీవ్రతను పరిశీలించి త్వరలోనే తగిన చర్యలు తీసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్తెక్క, వార్డు సభ్యులు శీను, భోజన్న,అనిల్, అశోక్, భార్గవ్, బాలమోహన్, నగేష్, మహేష్, రవి, అంజా గౌడ్ తదితరులతోపాటు వీడీసీ సభ్యులు, గ్రామ సంఘాల పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!