A place where you need to follow for what happening in world cup

అక్రమాలు చేసిన జీవన్ రెడ్డి భరతం పడతా: కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి..

మీడియా సమావేశంలో ఆర్మూర్ కాంగ్రెస్ లీడర్ వినయ్ రెడ్డి.

0 76

అక్రమాలు చేసిన జీవన్ రెడ్డి భరతం పడతా: కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.                                          తెలంగాణ ఫోకస్ మీ పొన్నాల: డిసెంబర్ 01: ఆర్మూర్ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు అనేక అవినీతి అక్రమాలు చేసి ప్రజలను నానా వేధింపులకు గురిచేసిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భరతం పడతామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరీ వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లో గల పివిఆర్ భవన్లో సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఆయన మాట్లాడుతూ జీవన్ రెడ్డి అనేకసార్లు తన కాళ్లు మొక్కాడని ఆయన కోసం తాను 125 కోట్లనుంచి 150 కోట్లు నష్టపోయానన్నారు. మొరం, ఇసుక ఇప్పటికీ జీవన్ రెడ్డి అనుచరులైన మధు మరొక వ్యక్తి నిర్వహిస్తున్నాడు అన్నారు. నమ్మి వచ్చిన వారిని మోసం చేయడమే జీవన్ రెడ్డి నైజమన్నారు. పది సంవత్సరాలు జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రజలకు బెదిరింపులు, ఇబ్బందులకు గురిచేసి ఆరేడుగురిని చంపినాడని ఆరోపించారు. అందుకే జీవన్ రెడ్డి అనే దుర్మార్గుడిని గత శాసనసభ ఎన్నికలలో 3వ స్థానంలోకి పంపించానని చెప్పారు. మున్సిపల్ లో కెమెరాలు పెట్టిన విషయంలో తన ప్రమేయం లేదని ఉద్యోగుల పనితీరును సమీక్షించడానికి పెట్టడం జరిగిందే తప్ప ఎలాంటి అవినీతి లేదన్నారు. మున్సిపల్ కార్యాలయం ద్వారా 450 ఇండ్లకు అక్రమంగా ఇంటి నెంబర్లు ఇప్పించారనే ఆరోపణలు అవాస్తమన్నారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకులు అక్రమంగా ఇంటి నెంబర్లు ఇప్పించినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. ఆర్మూర్ లోని విష్ణుజిత్ ఇన్ఫ్రా పేరుతో జీవన్ మాల్ ను మొదట పదిమంది కలిసి 40 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టారని వివరించారు. పెట్టుబడి పెట్టిన 10 మంది సంప్రదించడానికి వెళ్తే జీవన్ రెడ్డి స్వాధీనం చేసుకొని ఇప్పటివరకు ఆ 10 మందికి 40 లక్షల చొప్పున డబ్బులు ఇవ్వక ఇబ్బందుల గురి చేస్తున్నట్లు తెలిపారు. బంగారు సాయి రెడ్డికి 20 కోట్లు ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పారు. జీవన్ రెడ్డి బాధితులు తనను సాంప్రదిస్తే వారికి ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి తీసుకున్న డబ్బులను కక్కిస్తానన్నారు. ఇకనుంచి జీవన్ రెడ్డి గాని ఆయన తొత్తులైన అనుచరులు డ్రామాలు చేస్తే వదిలేది లేదని హెచ్చరించారు. జీవన్ రెడ్డి తొత్తుల భూములలో 200 వెంచర్ లో 30 వేల గజాలు అక్రమంగా తీసుకున్నాడని ఆరోపించారు. దీనికోసం నియోజకవర్గ నిధులు 10 లక్షలు మంజూరు చేసి నిర్మాణాలు చేశారని వివరించారు. జీవన్ రెడ్డి మాల్ కొరకు వెంకటేశ్వర కాలనీలోని ఇంటిని ఏపీ ఎస్ ఎఫ్ సి వద్ద తాకట్టు పెట్టి మార్ట్టిగేజి చేసి 20 కోట్లు రుణం తీసుకున్నారన్నారు. ఎస్ ఎఫ్ సి కి మాటీగేజ్ చేసిన ఇంటిని చిన్నమ్మ కుమారుడి పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన భాగోతాన్ని తొందరలో బయటపెడతానన్నారు. హైదరాబాద్ లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి 22 వేల గజాల స్థలం ఇస్తానని చెప్పి మోసం చేసి 100 ఎకరాలు అక్రమంగా తీసుకున్నాడు అన్నారు. జీవన్ రెడ్డి ఒక పెద్ద దొంగ కాబట్టి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు వాస్తవాలు గ్రహించి పార్టీ అధ్యక్ష పదవితో పాటు పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో విలువలేని జీవన్ రెడ్డి ఇకనుంచి అవాకులు చవాకులు చెబితే సహించేది లేదని తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.ఆర్మూర్ లోని డిగ్రీ కళాశాల వద్ద నీటిపారుదల శాఖ స్థలంలో వేసిన వెంచర్ బాగోతాన్ని బయటపెడతామన్నారు. జీవన్ రెడ్డి బాధితులు పివిఆర్ కు వచ్చి ఫిర్యాదు చేస్తే సీఎంతో మాట్లాడించి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భూములు డబ్బులు ఇచ్చే రకమని, జీవన్ రెడ్డి డబ్బులు భూములు దొబ్బే రకమని విమర్శించారు. ఇకముందు మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి గురించి మాట్లాడితే తగిన గుణపాఠం నేర్పిస్తామన్నారు. యజమానుల వద్ద డబ్బులు వసూలు ఆరోపణలు అవాస్తమన్నారు. జీవన్ రెడ్డి పింకు బుక్కు, నీ తొత్తులు, వారి భాగోతాన్ని బయటపెట్టి బట్టలూడదీసి ట్రిప్పుతానని హెచ్చరించారు. జీవన్ రెడ్డి క్రషర్ పెట్టి ప్రభుత్వానికి 80 కోట్లు బకాయి ఉన్నాడని, ఆ డబ్బులను ప్రభుత్వం వసూలు చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్,మాజీ ఎంపీటీసీ సభ్యుడు మాజిద్, మున్సిపల్ మాజీ చైర్మన్ పండిత్ పవన్,మాజీ వైస్ చైర్మన్ షేక్ మును, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ వాసు,నాయకులు కొంతం మురళి, భూపేందర్, చిట్టి రెడ్డి, శ్రావణ్, జిమ్మీ రవి, తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!