A place where you need to follow for what happening in world cup

ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూ.చ తప్పకుండా పాటించాలని:పోలీస్ కమిషనర్.

ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం: పోలీస్ కమిషనర్.

0 61

ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం: పోలీస్ కమిషనర్. తెలంగాణ ఫోకస్ (ర్మూర్ న్యూస్పొన్నాల)డిసెంబర్15: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడవ విడత ఎన్నికలు ఆర్మూర్ డివిజన్ పరిదిలో జరగనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య (ఐ.పీ.ఎస్) ఆర్మూర్ ఎ.సి.పి కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.                                            ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (ఐపిఎస్) మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూ.చ తప్పకుండా పాటించాలని తెలియజేశారు.
ప్రధానంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల సమస్యత్మకమైన అతిసమస్యత్మకమైనటువంటి పోలింగ్ స్టేషను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి, ప్రచారం గుర్తులను ప్రదర్శించడం నివారించాలని అన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని అన్నారు.
ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి విలులేకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారులు (విపిఓ)ఆయా గ్రామలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని అధికారులకు తెలియజేశారు.
ఎన్నికల రోజు సిబ్బంది తెల్లవారుజామునే తమకు కేటాయించి నటువంటి పోలింగ్ బూతు యందు సక్రమమైన విధులు నిర్వహించాలని, ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొత్తము పూర్తి అయ్యేవరకు ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని, ఎన్నికల నియమావళిని తూ.చ తప్పకుండా పాటించే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని విధినిర్వహణలో ఎలాంటి లోపాలు ఉన్న అట్టి సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.                    ఈ సందర్భంగా ఆర్మూర్ ఏ.సి.పి వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ పి.సత్యనారాయణ గౌడ్, సిఐ లు ఆర్మూర్ రూరల్ కె.శ్రీధర్ రెడ్డి, భీంగల్ పి.సత్యనారాయణ గౌడ్, ఎస్సైలు బాల్కొండ కె.శైలేందర్, నందిపేట్ జి.శ్యామ్ రాజ్, వేల్పూర్ బి.సంజీవ్, ముప్కాల్ కిరణ్ పాల్, మెండోర సుహాసిని, భీంగల్ కె.సందీప్,మోర్తాడ్ బి.రాము,కమ్మర్ పల్లి జి.అనీల్ రెడ్డి, ఏర్గట్ల పి.రాజేశ్వర్, మాక్లూర్ రాజశేఖర్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!