ఆశీర్వదించండి రాంపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా: సర్పంచ్ అభ్యర్థి గంట సత్తెమ్మ అనిల్
-బీరు, బిర్యానీ వద్దు. గ్రామ అభివృద్ధి ముద్దు: -తమ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి గెలిపించండి: సర్పంచ్ అభ్యర్థి గంట సత్తేమ్మ-అనిల్.
ఆశీర్వదించండి రాంపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా: సర్పంచ్ అభ్యర్థి గంట సత్తెమ్మ అనిల్. – బీరు, బిర్యానీ వద్దు. గ్రామ అభివృద్ధి ముద్దు: సర్పంచ్ అభ్యర్థి గంట సత్తేమ్మ-అనిల్. – తమ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి గెలిపించండి..
రాంపూర్ న్యూస్ (తెలంగాణ ఫోకస్ టీవీ) డిసెంబర్ 14: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల రాంపూర్ గ్రామ సర్పంచ్ గా గంట సత్తేమ్మ అనిల్ గారి కత్తేర గుర్తు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను ఆదివారం మీడియాతో ప్రచారంలో కోరారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గంట సత్తెమ్మ అనిల్ మాట్లాడుతూ.. మా రాంపూర్ గ్రామంలో సరైన మౌలిక వసతులు లేవని, అనేక సమస్యలతో గ్రామ ముడిపడి ఉందని సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామ అభివృద్ధి కొరకు ముందుంటానని ప్రధానమైనటువంటి సమస్యలు డ్రైనేజీ, వీధి దీపాలు, కట్టమీద మైసమ్మ, క్రైస్తవ మత సోదరులకు స్మశాన వాటిక, అర్హులైన వారికి స్థలాలతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, నీటి సమస్య, యువతకు మినీ ఇండస్ట్రియల్స్ కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సహకారమందే విధంగా చూస్తానని ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామంలో అనేక సమస్యలు పరిష్కరించడానికి అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలు ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను యువతను కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు రాజేశ్వర్, శేఖర్,విక్రమ్,ప్రవీణ్ తదితరులు యువకులు స్వచ్ఛందంగా కత్తెర గుర్తుకు ఓటు వేసి నిజాయితీపరుడు అయినటువంటి గంట అనిల్ గెలిపించుకుంటామని మీడియా ద్వారా తెలిపారు.