నూతన కమిషనర్ కు దృష్టి కి పలు సమస్యలు; బోడమీది నరేష్
తెలంగాణ ఫోకస్ (సబ్ ఎడిటర్ బి నరేష్)
ఆర్మూర్ మున్సిపల్ అధికారులు 33వ వార్డు వైపు కన్నెత్తి చూసిన దాఖలు లేవు మరి ముఖ్యంగా ఈ వార్డు మల్లారెడ్డి చెరువుకు అనుకొని ఉండటం వల్ల చెరువు నుండి వచ్చే దుర్వాసన దోమలు పందులు వలన సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు కాలనీవాసులు గత మున్సిపల్ కమిషనర్ పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వార్డ్ వైపు కన్నెత్తి చూసిన దాఖలు లేవు.మరి ముఖ్యంగా గోల్డ్ బంగ్లా(శివాజీ చౌక్) పక్కనే ఉండడం వల్ల పండగ సమయంలో, ర్యాలీల సమయంలో పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు డైవర్షన్ గా 33 వ వార్డును వాడుతారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఏర్పాటుచేసిన ఐ మాస్ బల్బులు గత సంవత్సరముగా వెలగక కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ పూజారి శ్రావణి గారికి వివరించారు. గురువారం రోజున మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మల్లారెడ్డి చెరువు వద్ద పలు సమస్యలను మున్సిపల్ అధికారులకు చెప్పిన సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా రాత్రి వేళల్లో దొంగలు కాలనీవాసుల ద్విచక్ర వాహనాలు నుండి పెట్రోల్ ను, కారుల యొక్క చక్రాలను విప్పుకుపోతున్నారు.ఈ వార్డు మల్లారెడ్డి చెరువుకు ఆనుకుని ఉండడం వల్ల చెరువు పక్కన ఏర్పాటు చేసిన డ్రైనేజీ పూర్తిగా నిండిపోయిందని అట్టి డ్రైనేజీలను శుభ్రపరచాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పూజారి శ్రావణి మాట్లాడుతూ పట్టణంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశలో ముందుకు వెళ్తున్నామని ఆమె అన్నారు. పట్టణ ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సకాలంలో పనులు చెల్లించాలని ప్రజలను మీడియా మిత్రులను కోరారు..