A place where you need to follow for what happening in world cup

మచ్చర్ల గ్రామంలో నూతన గ్రామ పాలకవర్గానికి పౌరసత్కారం…

సమన్వయకర్తగా జింధం నరహరి రిటైర్డ్ ఉపాధ్యాయులు..

0 52

మచ్చర్ల గ్రామంలో నూతన గ్రామ పాలకవర్గానికి పౌరసత్కారం…

సమన్వయకర్తగా జింధం నరహరి రిటైర్డ్ ఉపాధ్యాయులు

తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్)

ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామంలో ఆదివారం గురెడి రెడ్డి కళ్యాణ మండపంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సర్పంచ్ కట్ట మల్లవ్వ, ఉపసర్పంచ్ కట్ట నర్సారెడ్డి,వార్డు మెంబర్స్ శ్యామల,లక్ష్మి,అలేఖ్య,లింగయ్య,భూమా గౌడ్,భూమన్న,జగదీశ్వర్,గంగారాం,మంజుల,
లక్ష్మి,సంజీవ్ 12 మంది వార్డ్ మెంబర్ల కు శాలువలు పూలమాలలతో సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఆత్మీయ బంధుమిత్రులు,శ్రేయోభిలాషులు మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాలలో స్వర్ణయుగాన్ని తలపించే పనులు చేసి అధికారులను,అనధికారులను మెప్పించి,ఒప్పించి గ్రామానికి అత్యధికంగా నిధులు తెచ్చి, అభివృద్ధి,సంక్షేమ పథకాలతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ దంపతులు కట్ట మల్లవ్వ,కట్ట నర్సారెడ్డి లను శాలువలు పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా జింధం నరహరి రిటైర్డ్ ఉపాధ్యాయులు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!