మైనారిటీ రెసిడెన్షిల్ స్కూల్ లో స్వచ్ఛ భారత్
విజయవంతంగా 34 వారాలు పూర్తని సుంకె శ్రీనివాస్ వెల్లడి..
మైనారిటీ రెసిడెన్షిల్ స్కూల్ లో స్వచ్ఛ భారత్
విజయవంతంగా 34 వారాలు పూర్తని సుంకె శ్రీనివాస్ వెల్లడి
తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్)
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ ఆవరణలో ఆదివారం రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెట్ల కొమ్మలు, చెత్త చెదారాన్ని అలాగే పేరుకుపోయిన బండరాళ్లను తొలగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో చేస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 34 వారాలు పూర్తి చేసుకుందన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేడమే మా ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మా సభ్యులతో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థినీలు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది కవిత, పావని, కోటగిరి మైనారిటీ స్కూల్ జూనియర్ అసిస్టెంట్ కం దెవొ నూకల ఆదిత్య, విద్యార్థినీలు, స్వంచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బొగడమీది ప్రశాంత్, వేద రాజ్ కుమార్, జహీర్, గణేష్, రాకేష్, జంగిడి భోజన్న, కృషివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.