నేడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఏ.పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక..!
తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా రూ. 35.19 కోట్లు కేటాయింపు చేయించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
నేడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఏ.పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక..!
తెలంగాణ ఫోకస టీవీ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్)
తెలంగాణ జగిత్యాల జిల్లా ప్రముఖ దేవస్థానం కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుల సౌకర్యం కోసం 96 గదుల సత్రం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సుతో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా రూ. 35.19 కోట్లు కేటాయింపు చేయించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గతంలో తనను విద్యుత్ ప్రమాదం నుండి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కాపాడిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఏ పనిని మొదలు పెట్టిన కొండగట్టు అంజన్న సమక్షం నుండి మొదలుపెట్టడం ఆనవాయితీగా మార్చుకున్నారు.తన ఇష్ట దైవమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో సేవ చేసుకునే మార్గం కల్పించినందుకు దేవుని ప్రార్థిస్తూ భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెంది దేశంలో అగ్రగామిగా ఉండాలని ఈ సందర్భంగా కొండగట్టు అంజన్న మనస్ఫూర్తిగా వేడుకున్నారు..