A place where you need to follow for what happening in world cup

ఆర్మూర్ లో పలుచోట్ల దొంగల బీభత్సం.

"క్లూ టీమ్స్" ఆధారంగా దొంగలను పట్టుకుంటాం: సీఐ సత్యనారాయణ గౌడ్ వెల్లడి

0 86

ఆర్మూర్ లో పలుచోట్ల దొంగల బీభత్సం.                               ★“క్లూ టీమ్స్” ఆధారంగా దొంగలను పట్టుకుంటాం: సీఐ సత్యనారాయణ గౌడ్ వెల్లడి.   తెలంగాణ ఫోకస్ -మీ పొన్నాల (ఆర్మూర్ న్యూస్) జనవరి12: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని గోల్ బంగ్లా, దయనంద్ నగర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు.
ఒకేసారి ఓ కిరాణ దుకాణం,రెండు ఇండ్లు, బీడీల కర్కాణ లో దొంగతనానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ వారి పోలీస్ బృందం “క్లూ టీమ్స్” ఆధారంగా దొంగలను పట్టుకొనున్నారు.
పోలీస్ శాఖ ముందస్తు సమాచారం సంక్రాంతి పండుగ వేళలో ఊర్లోకి బయలుదేరివారు తమ విలువైన వస్తువులను తీసుకువెళ్లాలని లేదా బ్యాంకులో దాచాలని సమాచారం ఇచ్చినప్పటికీ ప్రజలు పోలీసులకు సహకరించాలేకపోయారు.. సంఘటనలు జరిగిందానికన్నా, జరగక ముందే వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు వ్యక్తిగత జాగ్రత్తలు ప్రతి ఒక్కరు పాటించాలని పదేపదే ప్రభుత్వ శాఖలు చెప్పినప్పటికీ ప్రజలు ఏమాత్రం అర్థం చేసుకోకపోవడం సరైనదికాదని సీఐ సత్యనారాయణ గౌడ్ వెల్లడించారు.
నేరస్థులను అతి త్వరలోనే పట్టుకుంటామని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సిఐ తెలిపారు.
ఈ దొంగతనాలకు ప్రధాన కారణాలు ఆ కాలనీలో సీసీ కెమెరాలు లేకపోవడం వీధి దీపాలు వెలగకపోవడం అని స్థానికులు చెప్పుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!