A place where you need to follow for what happening in world cup

మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ..!

-జనసేన పార్టీ నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ సంతోష్ వెల్లడి..

0 45

మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ..!

సంతోష్ -జనసేన పార్టీ నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ వెల్లడి..

తెలంగాణ ఫోకస్ న్యూస్ (ఆర్మూర్ సబ్ ఎడిటర్ బి.నరేష్)

ఆర్మూర్ పట్టణ కేంద్రంలో జనసేన పార్టీ సమవేశంలో మున్సిపాలిటీ ఎన్నికలలో ఆర్మూర్ లోని బలమైనచోట జనసేన పార్టి పోటీ చేస్తుందని, పవన్ కళ్యాణ్ ఆశయాలను జనసేన పార్టి సిద్దాంతలను గడప గడప కు తీసుకు వెళ్లాలని, ఎన్నికల లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇందుకు కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉండాలిని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉమ్మడి నిజామాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల కో ఆర్డినేషన్ ఇంచార్జ్ మచ్చ సుధాకర్ , గుండా సంతోష్(జనసేన పార్టీ నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్), ఆరె ప్రవీణ్ కుమార్(జనసేన పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం), మంచిర్యాల రాము, పడల రజనీకాంత్, లింగంపల్లి సురేష్, మహేష్, వినయ్, కల్యాణ్ గౌడ్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రo లో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది కావున ఆర్మూర్ నియోజకవర్గం మునిషిపాలిటీ పరిధిలో అలాగే ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ పరిధి జనసేన పార్టీ తరుపున పోటీ చేద్దాం అనుకున్న వారు బయోడేటతో తమను సంప్రదించాలని గుండా సంతోష్ , ప్రవీణ్ కుమార్ జనసేన నాయకులకు తెలిపారు..

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!