31వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తా: బిజెపి నాయకురాలు స్వభావిక గౌడ్.
తెలంగాణ ఫోకస్ -పొన్నాల జనవరి14: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని 31వ వార్డులో గత వారం రోజు నుంచి నీటి కొరత విపరీతంగా పెరిగిపోయి ప్రధాన సమస్యగా మారిందని బిజెపి నాయకురాలు స్వభావిక గౌడ్ గారికి విషయం తెలిసిన వెంటనే ఆ వార్డును సందర్శించి సమస్య పరిష్కరించారు. కోతుల బెడద ఆ కాలనీలో విపరీతంగా ఉండడం వల్ల నీటి సరఫరా అయ్యే మోటర్ ఫేస్ టు ఫేస్ కలవడంతో రిలే కాలిపోయిందని తెలిసిన వెంటనే క్లియర్ చేయించడం జరిగిందని తెలిపారు అక్కడున్న భాష్యం పాఠశాలతో పాటు చుట్టుపక్కల కాలనీలో నీటి నీటి కొరతను అతి త్వరలో పరిష్కరించే దిశలో ముందుకు వెళ్తానని ఆమె అన్నారు. ఏదైనా ఎప్పటికీ ప్రజల సమస్యలను రానున్న మున్సిపల్ ఎన్నికల ఎన్నికల్లో బిజెపి పార్టీ విజయం కైవసం చేసుకుంటుందని మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని పట్టణంలో ఉన్న 33 వార్డుల్లో అన్ని వార్డుల్లో బిజెపి అభ్యర్థులు విజయాన్ని సాధిస్తారని చేశారు. అలాగే అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి పట్టణాన్ని సుందరమయంగా మార్చుకోవడానికి ప్రతి బిజెపి అభ్యర్థికి అవకాశం కల్పించాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా 31వ వార్డులో తన వంతు బాధ్యతగా ప్రజాసేవ చేయడానికి ముందడుగు వేయనన్నట్లు మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు.