ముగిసిన కేపిఎల్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్…
కేపీఎల్ క్రికెట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్..
ముగిసిన కేపిఎల్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్…
కేపీఎల్ క్రికెట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్..
తెలంగాణ ఫోకస్ స్పోర్ట్స్ న్యూస్ జనవరి 15 (సబ్ ఎడిటర్ బి. నరేష్)
కరీంనగర్ నగరంలోని 18వ డివిజన్ కొత్తపల్లిలో గత 3 రోజులగా కేపిఎల్ క్రికెట్ లీగ్ టోర్నమెంటును డివిజన్ కి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు సిరిపురం శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
నేటితో క్రికెట్ పోటీలు ముగిసిన నేపథ్యంలో.. కేపీఎల్ క్రికెట్ ముగింపు వేడుకలకు జిల్లా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా వేడుకలకు వచ్చిన అతిథులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలను అందించి శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం గెలుపొందిన విన్నర్, రన్నర్లకు కప్పుల తోపాటు చెక్కులను అందజేశారు. దాంతోపాటు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన టీం సభ్యులకు మేముంటోలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. క్రీడల ద్వారా ప్రతి ఒక్కరు శారీరకంగా, మానసికంగా
బలంగా తయారువుతారన్నారు.
గెలుపోటములు సహజంగా తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, టోర్నమెంట్ నిర్వాహకులు సిరిపురం శ్రీకాంత్, కొత్తపల్లి మాజీ చైర్మన్ రుద్ర రాజు, మాజీ కార్పొరేటరు వంగపల్లి రాజేందర్ రావు, మాజీ జెడ్పీకో ఆప్షన్ సభ్యులు జామీలుద్దీన్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బండగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఎస్ కే బాబా,
జేరిపోతుల మొండయ్య, శెట్టి పెళ్లి ప్రభాకర్, కట్ల సుధాకర్, జేరిపోతుల శ్రీకాంత్, నాయకురాలు రుద్ర రాధ , శ్రీకాంత్ యువసేన సభ్యులు గాజుల విధాత్, శ్రీపురం శ్రీనాథ్ , రమేష్, నాని, సాయి ,అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.