గూగుల్ ఫార్మసీ ఏజెన్సీ అధినేత చేపూర్ గణేష్ గారి చేతుల మీదుగా “జన ప్రజావాణి” క్యాలెండర్ ఆవిష్కరణ. తెలంగాణ ఫోకస్ -పొన్నాల
ఆర్మూర్ పట్టణంలోని గూగుల్ ఫార్మసీ ఏజెన్సీ అధినేత చేపూర్ గణేష్ గారి చేతుల మీదుగా “జన ప్రజావాణి”క్యాలెండర్ ను ఆవిష్కరించారు. – అంతకుముందు మూడు రోజుల క్రితం పట్టణంలోని ప్రముఖ వైద్యులు, ఇండస్ట్రియల్స్ యాజమాన్యాలు, ప్రముఖ వైద్యులురాలు వసంత జ్యోతి, లాలన, డా”అజయ్ కుమార్, నిత్య ఈ.ఎన్.టి డాక్టర్ చైతన్య, నలంద హైస్కూల్, శ్రీ కనకదుర్గ సానిటరీ, శ్రీబాలాజీ ఇండస్ట్రీస్, గూగుల్ ఫార్మసీ ఏజెన్సీ చేపూర్ గణేష్, గార్ల చేతుల మీదుగా “జన ప్రజావాణి” క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పొన్నాల చంద్రశేఖర్ ”జన ప్రజావాణి” తెలుగు దినపత్రిక లో పాత్రికేయులుగా ఆర్మూర్ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న గూగుల్ ఫార్మసీ ఏజెన్సీ అధినేత చేపూర్ గణేష్ వారి మిత్రబృందం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా “జన ప్రజావాణి” డివిజన్ పత్రిక విలేఖరి పొన్నాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జన ప్రజావాణి పత్రిక క్యాలెండర్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి నాతోటి సహచర పాత్రికేయ మిత్రులు, ముఖ్యంగా పాఠకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా “జన ప్రజావాణి” యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.