పేకాట స్థావరంపై సిసిఎస్ మెరుపు దాడి…
తెలంగాణ ఫోకస్ -క్రైమ్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్..)
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య(ఐపీఎస్) యొక్క ఆదేశాల మేరకు సీసీఎస్ ఏ.సీ.పీ ఇంచార్జ్ శ్రీ మస్తాన్ ఆలి సూచనల మేరకు ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్, ఎస్.ఐ గోవింద్ మరియు సిబ్బందితో కలిసి నిజామాబాద్ టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల టాకీస్ రోడ్డు దగ్గరలో ఉన్న ఒక గదిలో ఆదివారం సాయంత్రం పేకాట స్థావరం పై రైడ్ చేసి 4 మంది పేకాట రాయుళ్ళు ను మరియు 10,350/- రూపాయలు నగదు, (4) సెల్ ఫోన్స్ లను స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం టౌన్ 4 పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గారికి అప్పగించారు