త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఆర్మూర్ ఏంవిఐ రాహుల్ కుమార్ వారి సిబ్బంది.
తెలంగాణ ఫోకస్ న్యూస్ జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆర్మూర్ ఏంవిఐ రాహుల్ కుమార్ ఆవిష్కరించారు. అంతకుముందు మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా “రిపబ్లిక్ డే” వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు, అధికారులకు, అనధికారులకు ప్రజాప్రతినిధులకు, సంబంధించిన శాఖల అధికారులకు, డివిజన్ ప్రజలకు ఆర్మూర్ ఎంవిఐ రాహుల్ కుమార్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు నవీన్, మనోజ్, దశరథ్, కళ్యాణ్, మీనాజ్ సిబ్బంది పాల్గొన్నారు