ఐలాపూర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
-పద్మశాలి సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన అధ్యక్షులు గోనె కృష్ణ
ఐలాపూర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. –పద్మశాలి సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన అధ్యక్షులు గోనె కృష్ణ. తెలంగాణ ఫోకస్ న్యూస్: నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయిలాపూర్ గ్రామం లోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం, యువజన సంఘం ఆధ్వర్యం లో మువ్వన్నెల జెండాను సంఘం అధ్యక్షులు గోనె కృష్ణ ఎగురవేసి గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ప్రతి సారి లాగే ఈ సారి కూడా సంఘం భవనం ముందు గణతంత్ర వేడుకలను నిర్వహించామని సంఘం కార్యవర్గం తెలిపారు. గణతంత్ర వేడుకల తో పాటు అన్ని పండుగలను నిర్వహిస్తామని అన్నారు. నా దేశం నా భారతదేశం అని కాలరెత్తి చెప్పుకునే స్థాయి కల్పించిన ఈ రోజు అని ఎందరో త్యాగధనుల ఫలితమే భారత దేశo స్వేచ్ఛ వాయులోకి వచ్చిన రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గోనె క్రిష్ణ, ఉపాధ్యక్షులు గుల్లె బాలకిషన్, కార్యదర్శి సంతోష్ , ఉప కార్యదర్శి పిస్కప్రకాష్, కోశాధికారి చిక్కెల నవీన్, సలహాదారులు అవధూత నర్సయ్య, ఊరటి సాయిలు, శెర్ల వేంకటేశ్వర్, బిల్లా వెంకటేశ్వర్ , యువజన సంఘం సభ్యులు ప్రశాంత్, సుమంత్, గణేష్, రవి, కుశాల్, నరేష్, చిక్కెల నరేష్ , సంఘం సభ్యులు పాల్గొన్నారు.