33వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం పక్క: ఓటరు మహాశయులు వెల్లడి.
ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి సూచనలతో..
33వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం పక్క: ఓటరు మహాశయులు వెల్లడి.
– ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి సూచనలతో…
తెలంగాణ ఫోకస్ న్యూస్: ఆర్మూర్ పట్టణ 33వ వార్డులో గడపగడపకు తిరుగుతూ ప్రచారం ను జోరుగా కొనసాగించుకున్నారు. ఈ ప్రచారానికి అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎం.పీ.టి సి బోగడమిది పెద్ద భాజన్న పాల్గొని జోరుగా ర్యాలీ ప్రచారం కొనసాగించారు. ప్రచారంలో భాగంగా 33వ వార్డులో పర్యటిస్తున్న ప్రజల నుండి ఓటరు మహాశయులు అపూర్వమైన బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్ధి బోగడమిది రాణి సుమన్ మాట్లాడుతూ.. తమను ఆశీర్వదించి ఆశీస్సులు అందించాలని చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వస్తున్న యువ నాయకున్నికి వార్డు పెద్దలు, ఓటరు లు,వార్డు ప్రజలు ఒక అవకాశం కల్పించాలని కోరారు. అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సహకారంతో వార్డును అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్దాం అని అందుకు వార్డు పెద్దలు,మహిళలు, యువకులు సహకరించి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు
పట్టణ అభివృద్ధికై అందరూ కలిసి రావాలని, అధికార పార్టీ అభ్యర్థిని బోగడమిది రాణి సుమన్ ను గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో సమస్యలు అన్ని పరిష్కరిస్తామని, బిచ్కుంద పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని, ఆర్మూర్ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని తెలిపారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో మొత్తం 36 సీట్లకు 36 సీట్లు కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మీ అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తోందని. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు
చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రధానంగా రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ సాగుకు అవసరమైన ఆర్థిక భద్రతను కల్పిస్తోంది.. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రవేశపెట్టి వారి దైనందిన ఖర్చులను తగ్గించింది. పేద కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ గృహ వ్యయాన్ని తగ్గిస్తోంది. అదేవిధంగా రేషన్ కార్డులు జారీ చేసి సన్న బియ్యం పంపిణీ చేస్తూ ప్రతీ పేదవాడికి కడుపు నిండా భోజనం పెడుతుందని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది. విద్య, వైద్యం రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను బలోపేతం చేస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. అలాగే దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పారు.33వ వార్డు అభ్యర్థి ని రాణి సుమన్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని వార్డు ప్రజలను, ఓటరు లను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎం.పీ.టి సి బోగడమిది పెద్ద భాజన్న, కాంగ్రెస్ పార్టీ యువ యువకులు, మహిళలు,వార్డు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు
ఇప్పటి వార్తలు.. ఇప్పుడే
మీ పొన్నాల చంద్రశేఖర్ జర్నలిస్ట్
7386505970