A place where you need to follow for what happening in world cup

33 వార్డులో గడపగడప ప్రచారం చేసిన వినయ్ రెడ్డి..

ఆర్మూర్ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం..

0 44

33 వార్డులో గడపగడప ప్రచారం చేసిన వినయ్ రెడ్డి 

–ఆర్మూర్ మున్సిపల్ పై పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం

తెలంగాణ ఫోకస్ న్యూస్( రిపోర్టర్ పొన్నాల చంద్రశేఖర్)

ఆర్మూర్ పట్టణ గోల్ బంగ్లా ప్రాంతంలోని 33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న బోగడమిది రాణి -సుమన్ తరపున గురువారం సాయంత్రం ఆర్మూర్ అసెంబ్లీ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డి వార్డులో గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఒక్కటి వివరిస్తూ
మీ అమూల్యమైన ఓటును చేతు గుర్తుకు వేసి 33 వార్డును అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజలను కోరారు, సుదీర్ఘకాలంగా ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రత్యేక వినయ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సమన్వయం సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో కృషి చేస్తూ ప్రజలకు న్యాయం చేశారని స్థానికులు తెలిపారు. 33 వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల లేమితో కాలనీవాసులు గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. తాను గెలుపొందితే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతానని తెలిపారు. ఈ సందర్భంగా 33 వార్డు ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి, కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో స్థానికులు, మహిళలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, మాజీ ఎంపిటిసి బోగడమీది పెద్దభాజన్న ,నారాయణపేట రాజకుమార్ బోగడమీది నరేష్, లారీ భాస్కర్ (NRI), సిద్దాపురం చిన్నయ్య ,బొగడ మీది భాస్కర్ (రియల్ ఎస్టేట్) , పాల నాగరాజు, బండి రమేష్, అక్బర్ మున్సబ్, రైస్ ,షబ్బీర్, జాహీద్, రైస్, ఆదిల్ ,పెద్ద స్థానికులు పెద్ద సంఖ్యలో మహిళలు యువత పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!