ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాలు..
-పర్యవేక్షించిన పోలీసు కమిషనర్ పి సాయి చైతన్య..
ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాలు..
–-పర్యవేక్షించిన పోలీసు కమిషనర్ పి సాయి చైతన్య..
తెలంగాణ ఫోకస్ న్యూస్
ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఫిబ్రవరి 10న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., పిప్రి రోడ్డు లో గల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆర్మూర్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పర్యవేక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్మూర్ మునిసిపాలిటీ ప్రాంతంలోని వివిధ పోలింగ్ బూత్ ల నుంచి వచ్చేటటువంటి బ్యాలెట్ బాక్స్ లను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవ్య, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ పి. సత్యనారాయణ మరియు ఎన్నికల పరిశీలకులు తదితరులు పాల్గొనడం జరిగింది.