A place where you need to follow for what happening in world cup

కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న.. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి

0 56

బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు       

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ -మీ పొన్నాల)ఫిబ్రవరి11: ఎన్నికల సంఘం మార్గదర్శలను తు.చ తప్పకుండా పాటిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ… ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా అంకితభావంతో కృషి చేసిన ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులకు ఆదేశాల మేరకు నిబంధనలు పాటిస్తూ.. బి.ఆర్ఎ.స్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి తో పాటు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మహేందర్ వారి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని 100% శాతం పోలింగ్ కు సహకరించాలని జిల్లా ప్రజలను కోరారు. అలాగే ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పగడ్బందీగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ కు, జిల్లా సిపి, ఆర్మూర్ సబ్ కలెక్టర్,ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ గౌడ్ సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!