మున్సిపల్ చైర్ పర్సన్ గా గోనె లహరి బాధ్యతల స్వీకరణ
– ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు తాహెర్ బిన్ హుధాన్, మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్
– అభినందించిన టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబి శ్రీనివాస్ (చిన్న), నియోజకవర్గ ఇంఛార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి.
తెలంగాణ ఫోకస్ న్యూస్ మీ పొన్నాల ఫిబ్రవరి26: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ గోనె లహరి రఘు, వైస్ చైర్మన్ గా కాట్ పల్లి వెంకటరెడ్డిలు గురువారం బాధ్యతలు పెద్దల సమక్షంలో స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు తాహెర్ బిన్ హుధాన్, మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబి శ్రీనివాస్ (చిన్న) హాజరయ్యారు.
చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లు పూజా కార్యక్రమం తర్వాత బాధ్యతలు స్వీకరించి చైర్ లో కూర్చున్నారు. వీరిని పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ఏబి శ్రీనివాస్ శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ లహరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనకు కౌన్సిలర్ గా పోటీ చేయించి చైర్మన్ గా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు సహకరించిన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు, వినయ్ రెడ్డి, ఏబి శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు అతీతంగా కౌన్సిలర్ల సహకారంతో, అందరి సలహ సూచనలతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, కమిషనర్ ఉమామహేశ్వర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ లు త్రివేణి గంగాధర్, స్వాతి సింగ్ బబ్లు, అయ్యప్ప శ్రీనివాస్, సర్పంచ్లు
యాళ్ల సాయి రెడ్డి, కొండి నడిపి గంగాధర్, కౌన్సిలర్లు, పద్మశాలి సంఘం సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.