ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: బిఆర్ఎస్ 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారద దినేష్.
పవిత్ర రంజాన్ మాసాన్ని సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: బిఆర్ఎస్ 8వ కౌన్సిలర్ శారద దినేష్
ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: బిఆర్ఎస్ 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారద దినేష్.
తెలంగాణ ఫోకస్ న్యూస్: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆర్మూర్ మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారద దినేష్ బిఆర్ఎస్ నాయకులను మామిడి పల్లి స్థానిక నేతలు ఇఫ్తార్ విందు కు స్వాగతం పలికారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు ముస్లిం సోదరులు తమ నివాసంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు.
ఆర్మూర్ బిఆర్ఎస్ నాయకులు 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారద దినేష్ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని బిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్ దినేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణం 8వ వార్డులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కౌన్సిలర్ దినేష్ పాల్గొనగా ఆయనకు ముందుగా శాలువా పూలమాలతో సత్కరించి సత్కరించారు.
సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ కౌన్సిలర్ దినేష్ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో తోటి ముస్లిం సోదరులు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.