బిఆర్ఎస్ నాయకులు 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారద దినేష్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి…
టిఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి



బిఆర్ఎస్ నాయకులు 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారద దినేష్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి…
ఆర్మూర్ తెలంగాణ ఫోకస్ -మీపొన్నాల భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితోనే భారతదేశంలో అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బిఆర్ఎస్ నాయకులు 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారద దినేష్ అన్నారు అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఆర్మూర్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పూజా నరేందర్,అలాగే మామిడిపల్లి చౌరస్తా వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి బిఆర్ఎస్ నాయకులు 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారద దినేష్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారద దినేష్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారు అభ్యున్నతి సాధించాలని అంబేడ్కర్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్బోధించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ, ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు బాబా సాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని చదువుల్లో రాణించాలని, తద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించాలని బిఆర్ఎస్ 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారద దినేష్ పిలుపునిచ్చారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని మార్గ నిర్దేశం చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రజలకు బిఆర్ఎస్ నాయకులు 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారద దినేష్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పోల సుధాకర్ & ఆర్మూర్ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు పూజ నరేందర్ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు, బాధ్యతలను, పదవులను చేపట్టగలుతున్నారని అన్నారు. భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ అన్ని వర్గాల వారికి హక్కులను కల్పిస్తున్నాయని, అంబేద్కర్ అందరి వాడు అని కొనియాడారు.
ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం అంకిత భావంతో కృషి చేద్దామని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే విద్యార్థులకు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే స్ఫూర్తి ఆని అన్నారు. సమాన విద్య , సమానత్వ హక్కులు, ప్రాథమిక హక్కులన్నీ రాజ్యాంగంలో పొందుపర్చినవే అని గుర్తు చేశారు. మన దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఎటువైపు చూసినా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సాగర్, మహిపాల్, మామిడి పల్లి యువకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, కమ్యూనిస్టు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
