ప్రియాంక క్లినిక్ , భారతి క్లినిక్ లను సీజ్ చేసిన డిఎంహెచ్ఓ.
అర్హత కలిగిన డాక్టర్లతో వైద్య చికిత్స పొందాలి: డిఎంహెచ్ఓ వెల్లడి
ప్రియాంక క్లినిక్ , భారతి క్లినిక్ లను సీజ్ చేసిన డిఎంహెచ్ఓ. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్లపై పోలీస్ కేసు నమోదు చేయాలి: స్థానికులు..
– గత సంవత్సరం పోలీస్ కేసు అయినా వైద్యం యేదచ్ఛంగా కొనసాగించిన వైనం.
– స్థానికుల ఫిర్యాదు మేరకు తక్షణమే చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్.
– డాక్టర్ సర్టిఫికెట్ లేకుండా ప్రియాంక,భారతి క్లినిక్ ల “నకిలీ డాక్టర్లు”గా చలమణి
– చర్చనీయాంశంగా మారిన నకిలీ వైద్యుల నిర్వాకం..
– ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అర్హత కలిగిన డాక్టర్లతో వైద్యం చేయించుకోవాలి: డిఎంహెచ్ఓ వెల్లడి
ఆర్మూర్ న్యూస్(తెలంగాణ ఫోకస్ టీవీ)జూన్ 04:
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్లపై జిల్లా వైద్య అధికారి యంత్రాంగం కదిలింది. ఆర్మూరు పట్టణ కేంద్రంలోని జిల్లా వైద్య అధికారి డి ఎం హెచ్ వో రాజశ్రీ ఆకస్మిక తనిఖీలు చేసి ప్రియాంక క్లినిక్, భారతి క్లినిక్ లను సంబంధించిన క్లినిక్ లను గురువారం జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ సీజ్ చేశారు.
ప్రపంచం కంప్యూటర్ యుగంలో పయనిస్తున్నప్పటికీ తెలిసి తెలియని అమాయ ప్రజలను ఏదో ఒక విధంగా మోసం చేస్తూన్న ఈ నకిలీ డాక్టర్లు రోజురోజుకు ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో పుట్టుకస్తున్నారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధి తో సైతం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరంగా భావించవచ్చు.
ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రియాంక క్లినిక్ భారతి క్లినిక్ లను ఏర్పాటు చేసుకొని వైద్యం అందిస్తున్నారు. ఎలాంటి మెడిసిన్ చదివి అర్హత కలిగిన సర్టిఫికెట్ లేకున్నప్పటికీ శస్త్ర చికిత్సలు చేయడం, మహిళలను తమ ఇష్టం వచ్చిన రీతిలో ముట్టి వైద్యం అందించడం జరుగుతుంది. ఎలాంటి సర్టిఫికెట్ లేకుండా నకిలీ డాక్టర్లుగా చలమణి అవుతూ వచ్చిరానీ వైద్యం చేస్తున్నారు. కొందరు బాధితులు రోగాలు నయం కాక అనారోగ్యానికి గురై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
కాగా వివరాలకు వెళితే ఇలా ఉన్నాయి..
గత సంవత్సరం ఈ నకిలీ డాక్టర్లను జిల్లా వైద్యాధికారులు గుర్తించి క్లినిక్ లను సీజ్ చేసి 1/2/205 న ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో నకిలీ డాక్టర్ సమీర్ రాయి పైన కేసు నమోదు అయింది అయినప్పటికీ ఏమాత్రం భయం లేకుండా యధావిధిగా మళ్లీ క్లినిక్లను తెరిచి అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు గత 06/04/2026 నాడు రోజున తనిఖీ చేసిన డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారులు క్లినిక్ లను సీజ్ చేసి పోలీస్ అధికారులకు రిపోర్ట్ ను అందజేశారు.
ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకొని అర్హత కలిగిన డాక్టర్ల వద్ద చికిత్స చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలు ఇలాంటి నకిలీ డాక్టర్లను నమ్మవద్దని క్వాలిఫైడ్ ఉన్న డాక్టర్లతో వైద్యం చేయించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆమె అన్నారు. ప్రభుత్వ అధికారులకు ప్రజల సహకారం తప్పనిసరి అని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు
కానీ పోలీస్ అధికారులు ఇట్టి క్లినిక్ నకిలీ డాక్టర్లపై కేసు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు జిల్లా డిఎంహెచ్ఓ అన్నారు. ఏదేమైనప్పటికీ స్థానిక పోలీస్ అధికారులు జిల్లా కలెక్టర్కు చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ ఆదేశాలనుగుణంగా, జిల్లా వైద్య అధికారి డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు డిప్యూటీ డిఎంహెచ్ఓ సూచనల ప్రకారంగా ఆర్మూర్ పోలీస్ అధికారులు నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులను స్థానికులు కోరారు.
ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో బాధితులకు వైద్యం అందించడం నేరమని వైద్యాధికారులే చెబుతున్నప్పటికీ కేసులు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే నిర్లక్ష్యం వహించడం వెనుక
కారణాలేంటో అర్థం కావడం లేదని స్థానిక ప్రజలు అంటున్నారు.
గతంలో క్లినిక్ నిర్వాహకుడు సమీర్ రాయ్ పై ఫిర్యాదు రావడంతో కేసు చేసి ఎఫ్ఐఆర్ తేదీ1/2/25న నమోదు చేసి కోర్టుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మళ్లీ అదే రీతిగా వైద్యం అందించడంతో స్థానికులు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా క్లినిక్ నిర్వాహకులు భయంకరమైన రోగాలు సైతం వైద్యం చేసినట్లు తెలిసింది.
ఈ విషయంపై వైద్యాధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచి తీవ్రంగా పరిగణించడంతో ప్రియాంక, భారతి క్లినిక్లను పోలీసుల సమక్షంలో సీజ్ చేశారు. కానీ నిర్వాహకులు దానిని పట్టించుకోకుండా భారతి క్లినిక్ నిర్వాహకుడు దుగ్గల్ రాయ్ మళ్లీ వెనకాల డోర్ తెరిచి వైద్యం అందిస్తు న్నారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసు లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించాల్సిన అధికారుల నిర్లక్ష్య వైఖరిని స్థానిక పూజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అనుమతి లేని క్లినిక్ లను తొలగించి నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్వో రాజశ్రీ, జిల్లా వైద్యాధికారుల బృందం, ఆర్మూర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీందర్,సాయన్న, జిల్లా అధికారులు చంద్రశేఖర్ వారితో వైద్య సిబ్బంది పాల్గొన్నారు
