A place where you need to follow for what happening in world cup

రెడ్ క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా ప్రముఖ న్యాయవాది జెస్సు అనిల్ కుమార్: ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం.

0 31

రెడ్ క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా ప్రముఖ న్యాయవాది శ్రీ జెస్సు అనిల్ కుమార్: ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం.

ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్) అక్టోబర్ 23:

ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ ఇటీవల జరిగిన ‘ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ’ నిజామాబాద్ జిల్లా ఎన్నికల్లో విజయం సాధించి, సొసైటీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా నియమితులైన సందర్భంగా ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు.

శుక్రవారం స్థానిక బార్ అసోసియేషన్ హాల్ నందు అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ చందర్ అధ్యక్షతన ఈ అభినందన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది శ్రీ జెస్సు అనిల్ కుమార్‌ను శాలువాతో పూలమాలలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

సమాజ సేవే ధ్యేయంగా పనిచేయాలి: వక్తలు..

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఆర్మూర్ బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాది రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా ఎంపిక కావడం ఆర్మూర్ న్యాయవాదులందరికీ గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. అనిల్ కుమార్ నాయకత్వంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాల సంఖ్య గణనీయంగా పెరగాలని, సేవా దృక్పథంతో పనిచేస్తూ ప్రజలకు రెడ్ క్రాస్ అందించే వైద్య సేవలు, ఇతర సహాయ కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువత మాదకద్రవ్యాల (డ్రగ్స్) బారినపడి జీవితాలను నాశనం చేసుకోకుండా, వాటి వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించి యువతను చైతన్య పరచాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానంతో పాటు అవయవ దానాల ప్రాముఖ్యతపై కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం రెడ్ క్రాస్ సొసైటీ ప్రాథమిక బాధ్యత అని వక్తలు పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు..

ఈ అభినందన కార్యక్రమంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సుదర్శన్, సీనియర్ న్యాయవాదులు లోక భూపతిరెడ్డి, గంగారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, శ్రీధర్, కిష్టయ్య, జక్కుల శ్రీధర్, జగన్, మురళి, తెడ్డు నర్సయ్య, పవన్, తాజొద్దిన్, ఖాందేశ్ సంగీత, బోచ్ కర్ వీణలతో పాటు పలువురు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!