సమస్యల పరిష్కారానికి ఆందోళన తప్పదు… ~జిల్లా స్థాయిలో నుంచే ప్రారంభించండి… ~మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
సమస్యల పరిష్కారానికి ఆందోళన తప్పదు…
~ జిల్లా స్థాయిలో నుంచే ప్రారంభించండి…
~ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్(తెలంగాణ ఫోకస్ టీవీ) నవంబర్ 05: దేశవ్యాప్తంగా లేదా రాష్ట్రాల్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే ముందుగా ఆందోళనకు సిద్ధపడాలని అందుకోసం జిల్లాల వారీగా కార్యవర్గ సిద్ధం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం (4న తేదీ) ఉదయం 11గం.ల నుండి సాయంత్రం 5గం.ల వరకు, దాదాపు 6గంటల పాటు సంగారెడ్డి జిల్లా రాంచంద్రపురం లోని హోటల్ శుభం ప్రిస్టేజ్ లో, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో, రాష్ట్ర కార్యవర్గంతో, జాతీయ నాయకులతో కలిసి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించి. పలు నిర్ణయాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మీడియాకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. అలాగే ఐజేయు మాజీ జాతీయ అధ్యక్షుడు అమర్, జాతీయ నాయకులు నరేందర్ వహీద్ ప్రసంగించారు. మారుతున్న కాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జర్నలిజంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా వర్కింగ్ జర్నలిస్టులు కూడా సిద్ధం కావాలని సూచించారు. ముఖ్యంగా సాధారణ కార్మికుల కంటే అద్వానంగా ఉన్న జర్నలిస్టుల పరిస్థితులను సరిదిద్దుకోవాలంటే ప్రభుత్వాలపై పోరాటం చేసి తమ సమస్యలను వారి దృష్టికి తీసుకురావాలని అన్నారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, రక్షణ అంశాలను దృష్టిలో పెట్టుకొని పని చేయాలని కోరారు. అనంతరం టి యు డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులు విరాహట్ అలీ మాట్లాడుతూ తప్పకుండా పెద్దలు సూచనలను స్వీకరించి అందుకని కార్యాచరణ సిద్ధం చేస్తామని, యూనియన్ ఎప్పుడు ఆందోళనకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
రాష్ట్రంలో అపరిస్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం కార్యచరణ సిద్ధం చేయడం, జర్నలిస్టుల ఆరోగ్యం నృత్యం హెల్త్ కార్డులను మంజూరు చేయించేందుకు మంత్రులకు ప్రజా ప్రతినిధులు, జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ ఆందోళన చేయాలని. వర్కింగ్ జర్నలిస్టులకు మాత్రమే సభ్యత్వాలు ఇచ్చి నిజమైన జర్నలిస్టులకు అండగా నిలవాలి. ఇళ్ల స్థలాల విషయంలో ఆయా జిల్లాల నుంచి నివేదికలు తెప్పించి పూర్తి వివరాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.