జర్నలిస్టులు, పోలీసుల సమన్వయంతోనే సమాజ రక్షణ: ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి
ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్ టీవీ)12: జర్నలిస్టులు తమ విధులను పారదర్శకంగా నిర్వహిస్తూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆర్మూర్ సీఐ కె.చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో జర్నలిస్టులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఐ కె.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి జర్నలిస్టునూ వ్యక్తిగతంగా పలుకరిస్తూ పరిచయం చేసుకున్న సీఐ, పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడారు.. సమాజానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్న మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై సమాచారం అందిస్తూ మత్తు పదార్థాల నిర్మూలనకు పూర్తి స్థాయిలో సహకరించాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువవుతూ ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లా సీపీ సాయి చైతన్య (ఐపీఎస్) గారి ఆదేశాల మేరకు ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ కోసం తాము నిరంతరం శ్రమిస్తామని తెలిపారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలోను, శాంతిభద్రతల రక్షణలోను ఆర్మూర్ సీఐతో పాటు సబ్-ఇన్‌స్పెక్టర్లు (ఎస్సైలు), పోలీస్ బృందం ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని సిఐ కె.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక పోలీస్ అధికారులతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.