ఆర్మూర్‌లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. భారీ బైక్ ర్యాలీతో కదిలిన బీఆర్‌ఎస్ శ్రేణులు.. గులాబీమయమైన పట్టణం… శ్రేణుల్లో నయా జోష్.
ఆర్మూర్‌లో కేటీఆర్‌కు ఘనస్వాగతం..
~ భారీ బైక్ ర్యాలీతో కదిలిన బీఆర్‌ఎస్ శ్రేణులు..
~ గులాబీమయమైన పట్టణం… శ్రేణుల్లో నయా జోష్.
~ కార్యక్రమం విజయవంతం చేయడంపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హర్షం.
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ -పొన్నాల) నవంబర్ 1: ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న ‘రైతు గర్జన’ సభకు వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు ఆర్మూర్ పట్టణంలో పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి.
బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు కేటీఆర్‌కు నీరాజనాలు పట్టారు.
ఆర్మూర్ బైపాస్ రోడ్డు వద్దకు కేటీఆర్ వాహనశ్రేణి చేరుకోగానే శ్రేణులు “కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి” వచ్చేది కేసీఆర్ రాజ్యమే అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు కేటీఆర్‌ను గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ మధ్య కేటీఆర్ వాహనశ్రేణి జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుంది. అక్కడ భోజనం ముగించుకున్న తర్వాత కేటీఆర్ ఆదిలాబాద్ రైతు గర్జన సభకు బయలుదేరి వెళ్లారు.
ఈ స్వాగత కార్యక్రమంతో ఆర్మూర్ పట్టణమంతా గులాబీమయంగా మారింది. ప్రధాన రహదారులను గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కేటీఆర్ పర్యటన ఆర్మూర్ బీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. స్వాగత కార్యక్రమం అత్యంత విజయవంతం కావడంపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.