రేషన్ డీలర్ల సమస్యలను అసెంబ్లీలో ఎత్తి చూపాలి: కేటీఆర్ కు ఆర్మూర్ రేషన్ డీలర్ల అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్, ప్రతినిధులు వినతి.
~ క్వింటాల్ కమీషన్ ₹300కు పెంచాలి: ~ నెలకు ₹5,000 గౌరవ వేతనం చెల్లించాలి
రేషన్ డీలర్ల సమస్యలను అసెంబ్లీలో ఎత్తి చూపాలి: కేటీఆర్ కు వినతి.
~ క్వింటాల్ కమీషన్ ₹300కు పెంచాలి
~ నెలకు ₹5,000 గౌరవ వేతనం చెల్లించాలి
~ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో కేటీఆర్ ను కలిసిన ఆర్మూర్ మండల రేషన్ డీలర్ల అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్, ప్రతినిధులు.. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ టీవీ) నవంబర్1: రాష్ట్రంలోని రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి, న్యాయం జరిగేలా చూడాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రైతు గర్జన సభకు వెళ్తున్న కేటీఆర్‌ను ఆర్మూర్‌లోని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నివాసంలో డీలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్ష, కార్యదర్శుల ఆదేశాల మేరకు, ఆర్మూర్ మండల రేషన్ డీలర్ల అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్ ఆధ్వర్యంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రేషన్ డీలర్లు తమ సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తూ… తెలంగాణలో ఏళ్లేళ్లుగా చాలీచాలని కమీషన్‌తోనే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా రేషన్ డీలర్లకు క్వింటాల్‌కు కనీసం ₹300 కమీషన్ చెల్లించడంతో పాటు, నెలకు ₹5,000 గౌరవ వేతనం వెంటనే అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేలాలని కోరారు.
రేషన్ డీలర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు, వారి సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదికగా గళమెత్తాలని కేటీఆర్‌కు సవినయంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కే. ఆశన్న, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, ప్రతినిధులు రమేష్, అర్షద్, రాజు తదితరులు పాల్గొన్నారు.